Sun. Dec 22nd, 2024
Indian Railways has created more than 640,000 working days till August 21, 2020 under the Garib Kalyan Rose Gar Campaign

365తెలుగు డాట్ కామ్ ,ఆన్లైన్ న్యూస్, ఢిల్లీ, 23 ఆగష్టు 2020: గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ కింద ఆరు రాష్ట్రాలు – బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ లలో భారతీయ రైల్వే 6,40,000 కంటే ఎక్కువ పని దినాలను కల్పించింది. ఈ ప్రాజెక్టులలో సాధించిన పురోగతినీ, ఈ పథకం కింద ఈ రాష్ట్రాల వలస కార్మికులకు కల్పిస్తున్న పని అవకాశాలను, రైల్వేలు, వాణిజ్యం, పరిశ్రమల శాఖల కేంద్ర మంత్రి పియూష్ గోయల్, నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో సుమారు 165 రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అమలు జరుగుతున్నాయి. ఈ అభియాన్ లో 2020 ఆగష్టు, 21వ తేదీ వరకు 12,276 మంది కార్మికులు నిమగ్నమై ఉన్నారు. ఈ పధకం కింద అమలు చేస్తున్న ప్రాజెక్టుల కోసం కాంట్రాక్టర్లకు 1,410.35 కోట్ల రూపాయల మేర నిధులు విడుదల చేశారు. ప్రతి జిల్లాలోనూ, రాష్ట్రాల్లోనూ రైల్వే శాఖ నోడల్ అధికారులను నియమించింది, తద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సన్నిహిత సమన్వయం ఏర్పడుతుంది.ఈ పథకం కింద రైల్వే శాఖ అనేక రైల్వే పనులను గుర్తించి, అమలు చేస్తోంది. ఆ పనులలో – (i) లెవల్ క్రాసింగ్‌ల కోసం అప్రోచ్ రోడ్ల నిర్మాణ ,నిర్వహణ; (ii) రైల్వే మార్గం వెంబడి జలమార్గాలు, కందకాలు, కాలువల అభివృద్ధి , శుభ్రపరచడం: (iii) రైల్వే స్టేషన్లకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం,నిర్వహణ; (iv) ఇప్పటికే ఉన్న రైల్వే కట్టలు / కోత మరమ్మతులు,వెడల్పు పనులు; (v) రైల్వే భూమి సరిహద్దు వద్ద చెట్ల పెంపకం; (vi) ఇప్పటికే ఉన్న కట్టలు / కోత / వంతెనల రక్షణ పనులు మొదలైనవి ఉన్నాయి.

Indian Railways has created more than 640,000 working days till August 21, 2020 under the Garib Kalyan Rose Gar Campaign
Indian Railways has created more than 640,000 working days till August 21, 2020 under the Garib Kalyan Rose Gar Campaign

వినాశకరమైన కోవిడ్ కారణంగా ప్రభావితమై, అధిక సంఖ్యలో వలస కార్మికులు తిరిగి వచ్చిన ప్రాంతాలు / గ్రామాలలో జీవనోపాధి అవకాశాలను పెంపొందించడానికి, వారికి సాధికారత కల్పించడానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ అనే భారీ ఉపాధి-గ్రామీణ ప్రజా పనుల కార్యక్రమాన్ని, 2020 జూన్, 20వ తేదీన ప్రారంభించారు. గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్ కింద మన్నికైన గ్రామీణ మౌలిక సదుపాయాల నిర్మాణానికి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.125 రోజులపాటు కొనసాగే ఈ అభియాన్, వలస కార్మికులు ఎక్కువ సంఖ్యలో తిరిగి వచ్చిన 6 రాష్ట్రాలు – బీహార్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఝార్ఖండ్, ఒడిశా లలోని, 116 జిల్లాల్లో 25 రకాల పనులు /కార్యకలాపాలను కేంద్రీకరించి, మిషన్ మోడ్ ‌లో అమలుచేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా, 50,000 కోట్ల రూపాయల మేర ప్రజా పనులు జరుగుతున్నాయి. అభియాన్ కింద 12 వేర్వేరు మంత్రిత్వ శాఖలు,విభాగాలు సమన్వయంతో, 25 ప్రజా మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయడానికీ, జీవనోపాధి అవకాశాల వృద్ధికీ, సమిష్టిగా కృషి చేస్తున్నాయి. ఆ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, రోడ్డు రవాణా, రహదారులు, గనులు, తాగునీరు, పారిశుధ్యం, పర్యావరణం, రైల్వేలు, పెట్రోలియం, సహజ వాయువు, నూతన, పునరుత్పాదక ఇంధనం, సరిహద్దు రోడ్లు, టెలికాం ,వ్యవసాయం ఉన్నాయి.

error: Content is protected !!