Fri. Nov 8th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 27,2023: భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి. జపాన్‌, ఆస్ట్రేలియా మార్కెట్లు తగ్గినా చైనా, కొరియా, తైవాన్‌ పెరగడం మదుపర్లలో ఆత్మవిశ్వాసం పెంచాయి.

ఫెడ్‌ అత్యధిక వడ్డీరేట్ల కొనసాగింపు, క్రూడాయిల్‌ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ దేశీయ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండటం, గ్రోత్‌ రేట్‌, ఫలితాల సీజన్‌ మొదలవ్వడం పాజిటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది.

దాంతో ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సూచీలు మధ్యాహ్నం గరిష్ఠాలకు చేరుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 51, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 173 పాయింట్లు ఎగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఫ్లాట్‌గా 83.23 వద్ద స్థిరపడింది.

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు డిఫెన్సివ్‌ స్టాక్స్‌ వైపు మొగ్గు చూపారు. ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ షేర్లను కొనుగోలు చేస్తున్నారు.

క్రితం సెషన్లో 65,945 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,925 వద్ద మొదలైంది. 65,549 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,172 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 173 పాయింట్లు పెరిగి 66,118 వద్ద ముగిసింది.

బుధవారం 19,637 వద్ద ఓపెనైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19,554 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,730 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 51 పాయింట్లు ఎగిసి 19,716 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్‌ 35 పాయింట్ల నష్టంతో 44,588 వద్ద ముగిసింది.

నిఫ్టీ 50లో 33 కంపెనీలు లాభపడగా 17 నష్టపోయాయి. ఎల్‌టీ (2.01%), కోల్‌ ఇండియా (1.81%), ఐటీసీ (1.56%), సిప్లా (1.41%), ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (1.33%) టాప్‌ గెయినర్స్‌.

టైటాన్‌ (1.38%), గ్రాసిమ్‌ (1.31%), హీరోమోటో (0.90%), ఎస్బీఐ (0.74%), ఐసీఐసీఐ బ్యాంకు (0.71%) టాప్‌ లాసర్స్‌. రంగాల వారీగా గమనిస్తే బ్యాంకు, ఫైనాన్స్‌ సూచీలు ఎరుపెక్కాయి. ఫార్మా, మిడ్‌క్యాప్‌, ఎఫ్‌ఎంసీజీ, స్మాల్‌క్యాప్‌, రియాల్టీ రంగాలు బలపడ్డాయి.

నిఫ్టీ పెరుగుదలలో రిలయన్స్‌ 20 పాయింట్ల మేర కంట్రిబ్యూట్‌ చేసింది. ఎల్‌టీ, ఐటీసీ, యాక్సిస్‌ దన్నుగా నిలిచాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ మళ్లీ నష్టాలకు దారితీశాయి.

నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్స్‌ టెక్నికల్‌ ఛార్ట్‌ను పరిశీలిస్తే 19,600 వద్ద సపోర్ట్‌, 19,750 వద్ద రెసిస్టెన్సీ ఉన్నాయి. ఇన్వెస్టర్లు స్వల్ప కాలానికి ఐచర్‌ మోటార్స్‌, కోల్‌ ఇండియా, ఎస్కార్ట్స్‌, అంబుజా సిమెంట్స్‌, క్యుమిన్స్‌ ఇండియా షేర్లను కొనుగోలు చేయొచ్చు.

అదానీ గ్రూప్‌ కంపెనీకి మహారాష్ట్రలో భారీ ప్రాజెక్టు దక్కింది. రూ.13,888 కోట్ల విలువైన స్మార్ట్‌ మీటర్‌ ప్రాజెక్టు దక్కింది. దాంతో గ్రూప్‌ స్టాక్స్‌ మొత్తం ఇన్వెస్టర్లకు రూ.10వేల కోట్ల సంపద సృష్టించాయి. బాంబే డైయింగ్‌ జీడీఆర్‌లు లగ్జెంబర్గ్‌ ఎక్స్‌ఛేంజీ నుంచి డీలిస్ట్‌ అయ్యాయి.

సంవర్ధన్‌ మదర్‌సన్‌ ఇంటర్నేషనల్‌లో 21.4 లక్షల షేర్లు చేతులు మారాయి. 2023, సెప్టెంబర్‌ 23న తమపై ఫైల్‌ అయిన ఎఫ్‌ఐఆర్‌ గురించి ఎం అండ్‌ ఎం స్పష్టత ఇచ్చింది. రూ.39.55 కోట్ల విలువైన కాంట్రాక్టుతో 3i ఇన్ఫోటెక్‌ షేర్లు పెరిగాయి.

అపార్‌ ఇండస్ట్రీస్‌, సీఈ ఇన్పోసిస్టమ్స్‌, కోల్‌ ఇండియా, ఫెడ్‌ బ్యాంకు, గుజరాత్‌ అంబుజా ఎక్స్‌పోర్ట్స్‌, ఇండియన్‌ బ్యాంకు, టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్ప్‌ షేర్లు ఇంట్రాడేలో 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709.
error: Content is protected !!