Fri. Oct 11th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,బెంగళూరు, 29 సెప్టెంబర్ 2024: ప్రతిష్టాత్మక టొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్‌లో (టిడిసిఏసి) ఫైనలిస్టులలో ఒకరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశాఖపట్నంకు చెందిన యువ కళాకారిణి కుమారి పేరూరి లక్ష్మీ సహస్ర ఎంపికైంది. 90 దేశాలు,ప్రాంతాల నుంచి వచ్చిన 712,845 ఎంట్రీలలోనుంచి ఆమె రూపొందించిన “టొయోటా ‘స్ మెమరీ కార్” అనే ఊహాత్మక సృష్టి, ప్రపంచ ఫైనలిస్టులలో ఒకరిగా ఎంపికైంది. 12-15 సంవత్సరాల విభాగంలో ఆమె అత్యుత్తమ విజయానికి గుర్తింపుగా, ఆమెకు 3,000 యుఎస్ డాలర్ల బహుమతి లభించింది.

టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ మాట్లాడుతూ, “కుమారి పేరూరి లక్ష్మీ సహస్ర వంటి యువతను చూడటం నిజంగా స్ఫూర్తిదాయకం. టొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ అనేది కేవలం పోటీ కంటే ఎక్కువ- ఇది మొబిలిటీ ద్వారా ప్రకాశవంతమైన, అనుసంధానిత భవిష్యత్తును ఊహించుకోవడానికి పిల్లలకు ఆహ్వానం.” అని చెప్పారు.

పేరూరి లక్ష్మీ సహస్ర గ్లోబల్ ఫైనలిస్టుగా గుర్తింపును పొందినందుకు సంతోషంగా తెలిపింది: “భవిష్యత్తులోని కార్లు ప్రపంచాన్ని ఎలా మార్చగలనో నేను ఊహించాను. నా కలల కారు, టొయోటా మెమరీ కార్, సాంకేతికతను మొబిలిటీకి సాధనంగా మాత్రమే కాకుండా, జ్ఞాపకాలను భద్రపరచడం.వ్యక్తులను అర్థవంతమైన మార్గాల్లో కనెక్ట్ చేయడం కోసం ప్రేరణగా రూపొందించింది.” అని పేర్కొంది.

విశాఖపట్నంలోని శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ విద్యార్థిని, పేరూరి లక్ష్మీ, భారతీయ యువత సృజనాత్మకతకు నిలువెత్తు ఉదాహరణ. ఆమె రూపొందించిన టొయోటా,మెమరీ కార్, అవార్డు గెలుచుకున్న ఎంట్రీలు 2023 డిసెంబర్ నుంచి 2024 మార్చి వరకు నిర్వహించిన జాతీయ పోటీలలో ఎంపిక చేయబడ్డాయి.

టొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ గురించి మరింత సమాచారం,పేరూరి లక్ష్మీ సహస్ర ,అవార్డు-గెలుచుకున్న కళాకృతిని చూడాలంటే, దయచేసి అధికారిక పోటీ వెబ్‌సైట్: https://www.toyota-dreamcarart.comని సందర్శించండి.

టొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ 18వ ఎడిషన్ డిసెంబర్ 2024 నుంచి నిర్వహించనుంది. మరిన్ని వివరాలు, భాగస్వామ్య అవసరాలు త్వరలో ప్రకటించబడతాయి.

error: Content is protected !!