365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,వారణాసి,మే15, 2025: పాకిస్తాన్‌కు మద్దతుగా తుర్కియే, అజర్‌బైజాన్ దేశాలు తన యుద్ధ వైఖరిని ప్రకటించడంతో భారతీయ పర్యాటకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో యూపీ (ఉత్తరప్రదేశ్) పర్యాటకులు తుర్కియే, అజర్‌బైజాన్ పర్యటనలను రద్దు చేసుకుంటూ భారతదేశంలోని మనాలి, శ్రీనగర్, ఊటీ వంటి హిల్ స్టేషన్లవైపు మళ్లుతున్నారు.

తాజాగా పహల్గాంలో ఉగ్రదాడి జరిగి 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భారత ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారీ దాడులు జరిపింది. ఈ చర్యలను తుర్కియే, అజర్‌బైజాన్ ఖండించడమే కాకుండా పాకిస్తాన్‌కు బహిరంగ మద్దతు ప్రకటించాయి.

ఇది కూడా చదవండి…పసిపిల్లల పోషణ కోసం డెక్సోగ్రోతో ముందుకొచ్చిన డేనోన్ ఇండియా

ఇది కూడా చదవండి…ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయి విచారణ..

ఇది కూడా చదవండి…బహుళ బంగారు పతకాలతో ఆసియా పవర్‌లిఫ్టింగ్‌లో రాణించిన కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ విద్యార్థులు..

దీంతో పలు భారతీయ ట్రావెల్ కంపెనీలు తుర్కియే, అజర్‌బైజాన్ ప్యాకేజీలను నిలిపివేశాయి. EaseMyTrip, Cox & Kings, Travomint వంటి సంస్థలు బుకింగ్స్ రద్దు చేయగా, Ixigo సంస్థ ఈ దేశాలకు బుకింగ్స్ నిలిపివేసింది.

ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా పిలుపుతో ఈ అభియానం మరింత ఊపందు కుంది. “ఈ రెండు దేశాలకు భారతీయులు రూ.4000 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇప్పుడు వారిని పర్యాటకంగా బహిష్కరించాల్సిన సమయం వచ్చింది” అని ఆయన ట్వీట్ చేశారు.

ఈ నేపథ్యంలో, ఉత్తరప్రదేశ్‌ పర్యాటకులు విదేశీ టూర్లకు బదులు దేశీయ పర్వత ప్రాంతాలు, హిల్ స్టేషన్లను ఎంచుకుంటున్నారు. దేశభక్తి భావంతో పాటు భద్రతా కారణాల వల్ల ఈ మార్పు చోటుచేసుకుంటోంది.