Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 31,2024: ఓపెన్ మెడికల్ ఎల్ఎల్ఎం లీడర్‌బోర్డులో (Open Medical LLM Leaderboard) భారతదేశ హెల్త్‌కేర్ ఏఐ స్టార్టప్ జివి (Jivi) అభివృద్ధి చేసిన పర్పస్-బిల్ట్ మెడికల్ లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) నంబర్ 1 ర్యాంకు దక్కించుకుంది.

ఈ క్రమంలో ఓపెన్ఏఐకి చెందిన జీపీటీ-4, గూగుల్‌కి చెందిన Med-PaLM 2 సహా పలు పేరొందిన ఎల్ఎల్ఎంలను జివికి చెందిన ఎల్ఎల్ఎం జివి మెడ్‌ఎక్స్ అధిగమించింది. రెడ్డి వెంచర్స్ చైర్మన్ జీవీ సంజయ్ రెడ్డి, భారత్‌పే మాజీ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ అంకుర్ జైన్ ఈ సంస్థకు సహ-వ్యవస్థాపకులుగా ఉన్నారు.

పరీక్షలు, పరిశోధనల నుంచి ఎంపిక చేసిన వైద్యపరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే సామర్థ్యాల ఆధారంగా మెడికల్-స్పెసిఫిక్ ఎల్ఎల్ఎంలకు లీడర్‌బోర్డు ర్యాంకులు ఇస్తుంది.

భారతదేశపు మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లు (ఎయిమ్స్ మరియు నీట్), అమెరికా మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్‌లు (USMLE) వంటి పరీక్షలు, క్లినికల్ నాలెడ్జ్, మెడికల్ జెనెటిక్స్, ప్రొఫెషననల్ మెడిసిన్‌కి సంబంధించిన అసెస్‌మెంట్లకు సంబంధించిన ప్రశ్నలతో ఇది సదరు ఎల్ఎల్ఎంలను మదింపు చేస్తుంది.

ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫాం హగ్గింగ్ ఫేస్, ది యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్, ఓపెన్ లైఫ్ సైన్స్ ఏఐ దీన్ని హోస్ట్ చేస్తున్నాయి.

“జనరేటివ్ ఏఐ ద్వారా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో జివి విప్లవాత్మక మార్పులు తెస్తోంది. నాణ్యమైన సంరక్షణ అత్యంత తక్కువ వ్యయంతో ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో ఉండేలా చూసేందుకు కృషి చేస్తోంది. వైద్యపరీక్షలను వేగవంతం చేయడం, కచ్చితత్వాన్ని పెంపొందించడం.

తద్వారా అందరికీ సకాలంలో, సరైన చికిత్స అందేలా చూసేందుకు మా ప్లాట్‌ఫాం తోడ్పడుతుంది” అని జివి సహ-వ్యవస్థాపకుడు, సీఈవో అంకుర్ జైన్ తెలిపారు.

జివిలో ప్రస్తుతం 20 మంది ఫిజిషియన్లు, సర్జన్లు, ఏఐ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు ఉన్నారు. అంతర్జాతీయంగా నాణ్యమైన హెల్త్‌కేర్‌ను తక్కువ వ్యయాలతో అందుబాటులోకి తెచ్చే టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు ఈ బృందం కృషి చేస్తోంది.

“ఒక భారతీయ కంపెనీ ఈ గుర్తింపు దక్కించుకోవడం గర్వకారణమైన విషయం. అంతర్జాతీయంగా అందరికీ అత్యుత్తమ హెల్త్‌కేర్‌ అందుబాటులోకి తేవాలనేది జివి లక్ష్యం.

మా ఎల్ఎల్ఎం ప్రపంచంలోనే అత్యుత్తమైనదిగా నిలవడమనేది వందకోట్ల మందికి జివిని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్న మాకు ఎంతో గర్వకారణమైన విషయం” అని జివి సహ-వ్యవస్థాపకుడు. చైర్మన్ జీవీ సంజయ్ రెడ్డి తెలిపారు.

Also read: Indian AI Startup Jivi Emerges as World’s Number 1, Beating OpenAI and Google

Also read: IDFC FIRST Bank to raise Rs 3,200 cr via preferential issue

Also read: ICICI Lombard and Capital Small Finance Bank forge Corporate Agency Alliance

ఇది కూడా చదవండి : వి (Vi) అంటోంది ‘లెట్స్ నెట్‌ఫ్లిక్స్’

Also read: Vi says ‘Let’s Netflix’

Also read: Glenmark Pharmaconcludes Hypertension Awareness Month in India

ఇది కూడా చదవండి : న్యూ లుక్ తో హీరో స్ప్లెండర్ ప్లస్ XTEC 2.0

error: Content is protected !!