Sat. Dec 14th, 2024
Gold ATM launched

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,డిసెంబర్ 4,2022: భారతదేశపు మొట్టమొదటి గోల్డ్ ATM హైదరాబాద్‌లో ప్రారంభించారు. గోల్డ్ ATM సంబంధించిన అని కార్యకలాపాలను నిర్వహించనున్నారు.

వినియోగదారులు తమ డెబిట్,క్రెడిట్ కార్డులను ఉపయోగించి ATM నుండి స్వచ్ఛమైన బంగారు నాణేలను కొనుగోలు చేయవచ్చు. హైదరాబాద్‌లోని బేగంపేటలోని రఘుపతి ఛాంబర్స్‌లో తొలి గోల్డ్ ఏటీఎంను ప్రారంభించినట్లు సమాచారం.

 Gold ATM launched

బంగారు ఏటీఎం కేంద్రాన్ని తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు.వినియోగదారులు 0.5 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు బంగారు నాణేలను కొనుగోలు చేయవచ్చు,వినియోగదారులు వారి స్వచ్ఛత,బరువును తెలిపే ధృవీకరణ పత్రాన్ని కూడా పొందుతారు.

గోల్డ్ ఏటీఎంలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్‌లోని గుల్జార్‌హౌస్‌, సికింద్రాబాద్‌, అబిడ్స్‌తోపాటు పెద్దపల్లి, కరీంనగర్‌, వరంగల్‌లో గోల్డ్‌ ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

error: Content is protected !!