India's Total Recoveries cross the landmark milestone of 60 lakhIndia's Total Recoveries cross the landmark milestone of 60 lakh

365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ,అక్టోబర్ 11,2020:భారత దేశం ఈ రోజు మరీ మైలురాయి దాటింది. ఇప్పటివరకు కోవిడ్ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 60 లక్షలు దాటింది. కచ్చితంగా చెప్పాలంటే 60, 77, 976 గా నమోదైంది. ప్రతిరోజూ కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తూండటంతో దేసవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో  89,154 మంది కోలుకున్నారు.

WhatsApp Image 2020-10-11 at 10.30.05 AM.jpeg

దేశమంతటా వైద్యపరమైన మౌలికసదుపాయాలు మెరుగు పడటంతో కేంద్రప్రభుత్వం సూచనలమేరకు  రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేస్తున్న ప్రామాణిక చికిత్సా నియమాలు, అంకిత భావంతో చేస్తున్న కృషి, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది అందించిన నిస్వార్థ సేవల ఫలితంగా ప్రతిరోజూ కోవిడ్ మరణాలు తగ్గుతూ వస్తున్నాయి.అదే విధంగా కోలుకుంటున్న పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వరుసగా గడిచిన 8 రోజులలో కొత్తగా నమోదవుతూ వస్తున్న రోజువారీ మరణాలు వెయ్యికంటే తక్కువగా ఉంటున్నాయి. గత 24 గంటల్లో 918 మరణాలు నమోదయ్యాయి.

WhatsApp Image 2020-10-11 at 10.29.29 AM.jpeg

ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసులు 8,67,496 ఉన్నాయి. ఈ విధంగా చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ, గడిచిన మూడు రోజులలో 8 లక్షల స్థాయిలో ఉన్నాయి.

WhatsApp Image 2020-10-11 at 10.30.06 AM.jpeg

జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం మరింత పెరుగుతూ ప్రస్తుతం 86.17% చేరింది. ఇలా కోలుకున్నవారి శాతం పెరుగుతూ ఉండటం వల్ల అంతర్జాతీయ స్థాయిలో కోలుకున్నవారి సంఖ్యపరంగా భారత్ స్థానం మెరుగుపడుతూ వస్తోంది. గరిష్టంగా చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితులలో అత్యధికశాతం (61%) ఉన్న రాష్ట్రాల్లోనే అత్యధికంగా కోలుకున్నవారి సంఖ్య (54.3%) కూడా ఉండటం గమనార్హం.

India's Total Recoveries cross the landmark milestone of 60 lakh
India’s Total Recoveries cross the landmark milestone of 60 lakh
WhatsApp Image 2020-10-11 at 10.32.48 AM.jpeg

కొత్తగా కోలుకున్నవారిలో 80% మంది కేవలం 10 రాష్ట్రాలకు చెందినవారే కావటం గమనార్హం. అందులో మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఢిల్లీ, చత్తీస్ గఢ్ ఉన్నాయి. అందులో మహారాష్ట్ర 26,000 మంది కొత్తగా కోలుకున్న కేసులతో ముందు వరుసలో ఉంది.

WhatsApp Image 2020-10-11 at 10.29.25 AM.jpeg

దేశంలో కొత్తగా 74,383 కేసులు కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయ్యాయి. ఈ కొత్త కేసులలో 80%  కేసులు పది రాష్ట్రాలలోనే కేంద్రీకృతమై ఉండగా అందులో కేరళ రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత స్థానం మహారాష్ట్రది. ఈ రెండు రాష్ట్రాలలో కలిసి 11,000 కొత్త కేసులు నమోదు కావటం గమనార్హం.

WhatsApp Image 2020-10-11 at 10.29.24 AM.jpeg

గడిచిన 24 గంటల్లో 918 మరణాలు నమోదయ్యాయి. వీటిలో84% కేసులు 10 రాష్ట్రాలనుంచి నమోదయ్యాయి. 308 మరణాలతో మహారాష్ట్రలో నిన్న 33% కేసులు నమోదు కాగా, 102 మరణాలతో కర్నాటక ఆ తరువాత స్థానంలో ఉంది.

WhatsApp Image 2020-10-11 at 10.29.22 AM.jpeg