Fri. Nov 15th, 2024
IndiGo cautions candidates to beware of fake job offers
IndiGo cautions candidates to beware of fake job offers
IndiGo cautions candidates to beware of fake job offers

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,నేషనల్,అక్టోబర్ 19, 2021: దేశంలోని ఎయిర్లైన్స్ సంస్థల్లో ప్రముఖ సంస్థ ఇండిగో. ఇండిగో సంస్థలో ఉద్యోగాల కోసం చాలామంది అభ్యర్థులు ప్రయత్నిస్తుంటారు. వారి వారి అర్హతలను బట్టి ఉద్యోగాలు వస్తుంటాయి. కానీ కొంతమంది ఫేక్ జాబ్ ఆఫర్స్తో అభ్యర్థుల్ని మోసం చేస్తున్నారు. దీంతో ఇండిగో సంస్థ…అభ్యర్థులకు అవగాహన కల్పించే ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది.అందులో భాగంగా… ఫేక్ ఉద్యోగ ఆఫర్లపై అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది.

కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా,వెబ్సైట్లో నకిలీ ఉద్యోగాలతో అభ్యర్థుల్ని మోసం చేస్తున్నారు.అంతేకాకుండా వారంతా ఇండిగో ఉద్యోగులం అని కూడా చెప్పుకుంటున్నారు.ఇంటర్వ్యూలు, ఉద్యోగాలు లేదా శిక్షణలకు బదులుగా డబ్బు కూడా డిమాండ్ చేస్తున్నారు . అలాంటి వారిని దయచేసి నమ్మవద్దని ఇండిగో
చెప్తోంది. ఇంటర్వ్యూలు నిర్వహించడం,ఉద్యోగాలు ఇవ్వడం లేదా చేరడానికి శిక్షణ ఇవ్వడం కోసం ఎయిర్లైన్ ఎలాంటి డబ్బు వసూలు చేయదు.ఎవరైనా డబ్బు అడిగితే ,ఎయిర్లైన్లో ఉద్యోగం ఇస్తామని వాగ్దానం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఇండిగో సూచిస్తుంది.అలాగే సంబంధిత వ్యక్తులపై తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది ఇండిగో.

ఈ సందర్భంగా ఇండిగో సీనియర్ వైస్‌ ప్రెసిడెంట్ & హ్యూమన్

IndiGo cautions candidates to beware of fake job offers
IndiGo cautions candidates to beware of fake job offers

రిసోర్స్ హెడ్ శ్రీ రాజ్ రాఘవన్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ…”కంపెనీ ప్రతినిధులుగా నటిస్తున్న కొంతమంది దుర్మార్గులు అమాయక అభ్యర్థులను మోసం చేస్తున్నారు.వారి ఆటల్ని కట్టిపెట్టి, అలాంటి మోసగాళ్లను చట్టపరంగాశిక్షించేందుకు ఇండిగో పూర్తిగా కట్టుబడి ఉంది. గత కొన్నేళ్లుగా, ఈ మోసగాళ్లను పట్టుకోవడంలో మాకు చాలా సహాయం చేస్తున్న కొన్ని సంస్థలకు మేము విజయవంతంగా సహకరించాము.ఏదేమైనా, మోసగాళ్లను అభ్యర్థులు నమ్మకుండా ఉన్నప్పుడు మాత్రమే మనం వీటిని అరికట్టవచ్చు. ఇండిగో అభ్యర్థుల నుండి ఛార్జీలు వసూలు
చేయదు. ఒకవేళ అభ్యర్థి నుండి డబ్బు కోరే ఎవరైనా, ఆ మొత్తం ఎంత చిన్నదైనా… అది కచ్చితంగా మోసం చేయడం కిందే వస్తుంది అని అన్నారు .

ఆయన.ఈ సందర్భంగా… ఇండిగో హోల్‌ టైమ్‌ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ రోనోజోయ్ దత్తా మాట్లాడుతూ… “సలహాదారులు, వాణిజ్య ప్రకటనలు, అవగాహన ప్రచారాల ద్వారా మేము ఉద్యోగార్దులకు ఎప్పటికప్పుడు ఇలాంటివి నమ్మవద్దని సూచిస్తూనే ఉన్నాము. మార్కెట్ లీడర్‌గా, ఇండిగోను మాత్రమే కాకుండా, ఈ రంగంలోని ఇతర కంపెనీలను కూడా ప్రభావితం చేసే ఇలాంటి అక్రమాలను గుర్తించడం,నియంత్రించడం మా బాధ్యత అని మేము నమ్ముతున్నాము. ఈ
నేరస్థులను గుర్తించేందుకు మేము అన్ని విభాగాలతో కలిసి పనిచేస్తున్నాము. గతంలో కూడా చాలామందిని గుర్తించి పోలీసులకు అప్పగించాము. పోలీసు శాఖ నుండి మద్దతు, ప్రజలలో అవగాహనతో ఈ మోసాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని మేము ఆశిస్తున్నాము అని అన్నారు.

IndiGo cautions candidates to beware of fake job offers
IndiGo cautions candidates to beware of fake job offers

పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారి సహాయం తీసుకోవడం, అలాగే అవగాహన ప్రచారాలతో.. మోసగాళ్లను ఇండిగో దాదాపు కట్టిడి చేసింది.ఇండిగోలోని అందరు ఉద్యోగులకు హెచ్ఆర్ మేనేజర్ నుండి తరచుగా ఈ-మెయిల్స్ వస్తుంటాయి. అంతేకాకుండా నకిలీ జాబ్ ఆఫర్ల గురించి అవగాహన కల్పించడం,అవగాహన వ్యాప్తికి మద్దతు కోరడం, అన్ని ఎయిర్ పోర్ట్లోని ముఖ్య ప్రదేశాలలో “జాగ్రత్త” పోస్టర్లు/ స్టాండ్లు
ఉంచడం వంటి వివిధ చర్యలను తీసుకుంటుంది. ఇక నియామకాల సమయంలో, ఇండిగో అధికారిక సోషల్ మీడియా ఛానెల్స్ అయిన Twitter, Facebook,LinkedIn. IndiGoలో వారానికి/ 15 రోజులకు ఈ నకిలీ జాబ్ల గురించి అవగాహన కల్పిస్తూ పోస్ట్లు ఉంటాయి. ఇందుకోసం వివిధ జాబ్ పోర్టల్స్ కూడా ఇండిగోకు సహకరిస్తున్నాయి. దీంతోపాటు… నకిలీ ఉద్యోగ ఆఫర్లకు వ్యతిరేకంగా అభ్యర్థులకు సలహాలు,సూచనలు ఇచ్చేందుకు వర్చువల్,ఫిజికల్ ఇంటర్వ్యూలను కూడా నిర్వహిస్తున్నారు. ఎయిర్లైన్స్
,అధికారిక కెరీర్ వెబ్సైట్ హోమ్ పేజీలో “జాగ్రత్త” గమనికను కూడా కలిగి ఉంది. మరింత సమాచారం కోసం దయచేసి http://bit.ly/3ix0dbL ని సందర్శించండి.

error: Content is protected !!