365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 27,2024: ఇండిక్యూబ్ స్పేసెస్ లిమిటెడ్, మేనేజ్డ్ వర్క్‌స్పేస్ సొల్యూషన్స్ కంపెనీ, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) ద్వారా నిధులు సమీకరించేందుకు ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను (డీఆర్‌హెచ్‌పీ) సెబీకి సమర్పించింది.

ఈ ఐపీవోలో రూ. 750 కోట్ల విలువైన నూతన షేర్లు జారీ చేయనుండగా, ప్రమోటర్ సెల్లింగ్ షేర్హోల్డర్లైన రిషి దాస్, మేఘనా అగర్వాల్ రూ. 100 కోట్ల వరకు విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఏస్) ద్వారా విక్రయించనున్నారు.

ఈ నిధులను కొత్త సెంటర్ల స్థాపన (రూ. 462.6 కోట్లు), సంస్థకు చెందిన రుణాలను పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లించేందుకు (రూ. 100 కోట్లు),ఇతర కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించుకునేలా ప్లాన్ చేస్తున్నారు.

2015లో స్థాపించబడిన ఈ కంపెనీ ప్రస్తుతం 13 నగరాల్లో 103 సెంటర్ల పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తోంది. 2024 జూన్ 30 నాటికి 1,72,451 సీటింగ్ సామర్థ్యంతో 7.76 మిలియన్ చ.అ. స్థలం నిర్వహణలో ఉంది.

ఇండిక్యూబ్ క్లయింట్లలో జీసీసీలు, భారతీయ కార్పొరేట్లు, యూనికార్న్‌లు, వివిధ రంగాల్లో పనిచేసే సంస్థలు ఉన్నాయి, వాటిలో మింత్రా, అప్‌గ్రాడ్, జిరోధా, నో బ్రోకర్, రెడ్‌బస్, జస్‌పే, పెర్ఫియోస్, మొగ్లిక్స్, నింజాకార్ట్, సీమెన్స్, నారాయణ హెల్త్ వంటివి ఉన్నాయి.

ఇండిక్యూబ్ స్పేసెస్ లిమిటెడ్‌కు వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్, ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థ,ప్రముఖ ఇన్వెస్టర్ ఆశీష్ గుప్తా మద్దతుగా ఉన్నారు. రిషి దాస్, చైర్మన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో, మేఘనా అగర్వాల్, సీవోవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

2023 ఆర్థిక సంవత్సరంలో, సంస్థ మొత్తం ఆదాయం రూ. 601.2 కోట్లుగా నమోదు కాగా, 2024 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 867.6 కోట్లకు చేరింది.

2024 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఎబిటా (EBITDA) రూ. 263.4 కోట్లుగా ఉంది. 2025 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సంస్థ ఎబిటా రూ. 153 కోట్లను సాధించింది.