365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యుస్,మార్చి 26,2025: భారతదేశపు స్వదేశీ ఆండ్రాయిడ్ యాప్ మార్కెట్‌ప్లేస్ అయిన ఇండస్ యాప్‌స్టోర్, సాంకేతిక ప్రపంచంలో ముందంజలో ఉన్న షావోమీ ఇండియాతో పలు సంవత్సరాల భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఈరోజు ప్రకటించింది.
భారతీయ యూజర్ల కోసం వారి మాతృభాషల్లోనే అందుబాటులోకి తెచ్చిన డిజిటల్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసే విషయంలో ఇండస్ యాప్‌స్టోర్, షావోమీ ఇండియాల ఉమ్మడి నిబద్ధతను ఈ ఒప్పందం స్పష్టం చేస్తోంది.
భారతదేశంలో ఇకపై విడుదలయ్యే అన్ని కొత్త షావోమీ స్మార్ట్‌ఫోన్లలో ఇండస్ యాప్‌స్టోర్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేయడంతో పాటు, ఇదివరకే వినియోగంలో ఉన్న పాత పరికరాల్లో ప్రస్తుతం ఉన్న ‘గెట్‌యాప్’ను ఇండస్ యాప్‌స్టోర్‌తో భర్తీ చేయాలని ఈ ఒప్పందంలో నిర్ణయించారు.
దీంతో యాప్‌ల యాక్సెసిబిలిటీని, యాప్‌ను వెతికి, పొందడాన్ని, అలాగే అవాంతరాలు లేని యూజర్ ఎక్స్‌పీరియెన్స్‌ను పెంపొందించడంపై ఇండస్ యాప్‌స్టోర్ దృష్టి సారించింది.

ఈ భాగస్వామ్యం గురించి ఇండస్ యాప్‌స్టోర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ప్రియా ఎమ్ నరసింహన్ మాట్లాడుతూ, “భారతీయ మొబైల్ యూజర్లు, అలాగే డెవలపర్లకు సమాన స్థాయిలో అందుబాటులో ఉండే యాప్ స్టోర్‌ను రూపొందించాలనే మా లక్ష్యాన్ని చేరుకోవడంలో, షావోమీ ఇండియాతో మేము కుదుర్చుకున్న భాగస్వామ్యం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది.
షావోమీ ఇండియా మార్కెట్ పరిధికి, పలు భారతీయ భాషల్లో లభించే మా యాప్ డిస్కవరీ ప్లాట్‌ఫామ్‌ను అనుసంధానించడం వల్ల, యూజర్లకు నిరాటంకంగా, సాంస్కృతిక పరమైన అనుభవాన్ని అందిస్తూనే యాప్ డెవలపర్లకు చక్కని అవకాశాలను సృష్టిస్తున్నాము.
భారతదేశ ప్రజలు మొబైల్ యాప్‌లను గుర్తించే పద్ధతిని, పొందుతున్న అనుభవాన్ని మెరుగుపర్చాలనే మా లక్ష్యానికి ఈ భాగస్వామ్యం ఆరంభం మాత్రమే” అని అన్నారు.
ఈ భాగస్వామ్యంపై షావోమీ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధిన్ మాథుర్ మాట్లాడుతూ, “భారతదేశ డిజిటల్ ఎకోసిస్టమ్ రోజురోజుకీ పెరుగుతూనే ఉండటం వల్ల, స్థానికంగా క్రియేట్ చేసిన, అలాగే స్థానికుల కోసమే డెవలప్ చేసిన యాప్‌లు ఉండే మార్కెట్‌ప్లేస్‌కు మునుపెన్నడూ లేనంత డిమాండ్ ఏర్పడింది.
షావోమీ ఇండియాలో విధులు నిర్వహించే మేమంతా, ఎల్లప్పుడూ ‘మేక్ ఫర్ ఇండియా’ ఆవిష్కరణలకు మద్దతుగా నిలిచాము, అలాగే ఇండస్ యాప్‌స్టోర్‌తో కుదుర్చుకున్న ఈ భాగస్వామ్యం కూడా ఆ దిశలో వేసిన ఒక వ్యూహాత్మక అడుగు.
ఇండస్ యాప్‌స్టోర్‌ను మా ఎకోసిస్టమ్‌తో అనుసంధానించడం వల్ల, యూజర్లకు నిరాటంకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రయోజనకరమైన యాప్‌లను వెతికి, సులభంగా పొందే అనుభవాన్ని అందించాలనే మా లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము, అదే సమయంలో భారతీయ డెవలపర్లు తమ యాప్‌లతో విస్తృత స్థాయిలోని యూజర్లకు చేరువ కావడంలో సహకరిస్తున్నాం.
భారతదేశంలో బలమైన, సమగ్రమైన డిజిటల్ ఎకోసిస్టమ్‌ను పెంపొందించడానికి, యూజర్లను, అలాగే డెవలపర్లను సమాన స్థాయిలో శక్తివంతులను చేయడానికి మా రెండు బ్రాండ్‌లకు ఉన్న అచంచలమైన నిబద్ధతను ఈ భాగస్వామ్యం ప్రతిబింబిస్తుంది” అని చెప్పారు.
ఈ భాగస్వామ్యంలో భాగంగా స్థానిక భాషలో క్రియేట్ చేసిన, చక్కని ఫీచర్లు ఉన్న యాప్ మార్కెట్‌ప్లేస్‌ను అనుసంధానిస్తే, ఇది దేశంలో స్వయం సమృద్ధిగల, యూజర్‌కు మొదటి ప్రాధాన్యతను ఇచ్చే డిజిటల్ మౌలిక సదుపాయాల నిర్మాణంలో సహాయపడుతుంది.
దీని వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది యూజర్లకు వినూత్నమైన యాప్‌లను అందుబాటులోకి తేవడంలో, అలాగే వాటి యాక్సెసబిలిటీ మెరుగవ్వడంలో ఉపయోగపడుతుంది.

లేటెస్ట్ ఇండస్ యాప్‌స్టోర్ వెర్షన్‌కు సంబంధించిన కొన్ని ప్రోడక్ట్ ముఖ్యాంశాలు:
బహుభాషా యాప్ ఆవిష్కరణ: యూజర్లు 12 భారతీయ భాషలలో యాప్‌లను వెతికి, చూడవచ్చు, దీని వల్ల స్థానిక భాషలు మాట్లాడేవారు తమకు నచ్చిన యాప్‌లను సౌకర్యవంతంగా వెతకొచ్చు
వీడియో-ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్: డౌన్‌లోడ్ చేసుకునే ముందు యాప్‌లు ఎలా పని చేస్తాయి, ఫోన్‌లో ఎలా కనిపిస్తాయి వంటి అంశాలను వీడియో రూపంలోనే చూసుకునే వినూత్నమైన యాప్‌ను వెతికి, చూసే వ్యవస్థ
వాయిస్-ఎనేబుల్డ్ సెర్చ్: 10 భారతీయ భాషలలో వాయిస్ కమాండ్‌లను సపోర్ట్ చేస్తుంది, దీని వల్ల ప్రత్యేకమైన కీబోర్డులు లేదా సంక్లిష్టమైన అక్షరాలను టైప్ చేసే ప్రక్రియ అవసరం లేదు
సమగ్రమైన యాప్ కలెక్షన్: 45 కేటగిరీలలో 5 లక్షలకు పైగా మొబైల్ యాప్‌లు, గేమ్‌లను యాక్సెస్ చేయవచ్చు, యూజర్ల అన్ని అవసరాలకు అనుగుణంగా విభిన్నమైన ఆప్షన్లను అందుబాటులో ఉంచుతుంది
ఇండస్ యాప్ స్టోర్ గురించి పరిచయం:ఇండస్ యాప్‌స్టోర్ అనేది సహజమైన ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ యాప్ స్టోర్, ఇది భారతీయ యూజర్ల కోసం స్థానిక భాషలో, అలాగే వారి సాంస్కృతిక అవసరాలకు తగ్గట్లుగా రూపొందింది.
విస్తృత శ్రేణి కేటగిరీలతో, యూజర్ల స్థానిక భాషలో అందుబాటులో ఉండేలా, సందర్భోచితమైన, వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి ఇది కృషి చేస్తుంది. ఇండస్ యాప్‌స్టోర్ ఇంగ్లీష్‌తో పాటు 12 భారతీయ భాషలలో అందుబాటులో ఉంది, ఇది యూజర్లు తమకు నచ్చిన భాషలో యాప్ స్టోర్‌ను ఎక్స్‌ప్లోర్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది.

ఈ భారతీయ యాప్ వాతావరణంలో డెవలపర్లు తమ ప్రోడక్ట్‌లను పబ్లిష్ చేసుకుని, పంపిణీ & ప్రచారం చేయడానికి అవసరమైన న్యాయమైన, సమానమైన అవకాశాలను ఇండస్ యాప్‌స్టోర్ అందిస్తుంది.
డెవలపర్లే స్వయంగా తమ యాప్‌లను పబ్లిష్ చేసుకునే వేదికను, స్థానిక భాషల్లో యాప్‌లను అందుబాటులోకి తెచ్చే సర్వీస్‌లను, యాప్‌లను డెవలపర్లు పర్యవేక్షించి, మెరుగుపర్చే పలు టూల్స్‌ను, అలాగే అంకితభావంతో పనిచేసే 24×7 కస్టమర్ సహాయ విభాగాన్ని ఇండస్ యాప్‌స్టోర్ అందిస్తుంది.
మరిన్ని వివరాల కోసం media@indusappstore.comకు మెయిల్ చేయండి.