365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై,ఆగస్టు 7,2024: అత్యంత సంపన్న వర్గాల (హెచ్ఎన్‌డబ్ల్యూఐ) విశిష్ట అవసరాలను తీర్చే విధంగా తీర్చిదిద్దిన ‘పయోనీర్ ప్రైవేట్ ప్రోగ్రాం’ పేరిట ఇండస్‌బ్యాంక్ ఆర్థిక సేవలను ప్రారంభించింది.
బ్యాంకు ఇప్పటికే హెచ్ఎన్ఐ సెగ్మెంట్‌లో పటిష్టంగా కార్యకలాపాలు సాగిస్తుండగా హెచ్ఎన్‌డబ్ల్యూఐల వైవిధ్యమైన ఆర్థిక, బ్యాంకింగ్ అవసరాలను తీర్చేందుకు వ్యక్తిగతీకరించిన సేవలు అందించడంలో తాజా ప్రోగ్రాం మరో ముందడుగులాంటిది.
సాంప్రదాయమైనవే కాకుండా అధునాతనమైన ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు, ఎస్టేట్,లెగసీ ప్లానింగ్, నిరాటంకమైన ట్రేడ్,ఫారెక్స్ సర్వీసులు, కస్టమైజ్ చేసిన క్రెడిట్,స్ట్రక్చరింగ్ సొల్యూషన్స్‌తో పాటు క్లయింట్ ఆధారిత వ్యక్తిగతీకరించిన సేవలు మొదలైన ఫుల్ స్టాక్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ ఎన్నో ఈ ప్రోగ్రాంలో సమగ్రంగా అందుబాటులో ఉంటాయి.
అంతే గాకుండా దిగ్గజ ఇన్సూరర్లతో భాగస్వామ్యాల వల్ల వ్యక్తిగతీకరించిన బీమా సొల్యూషన్స్ అందుకోవచ్చు. అలాగే క్లయింట్ అభిరుచుల మేరకు తీర్చిదిద్దిన విలాసవంతమైన లైఫ్‌స్టయిల్ అనుభూతులు పొందవచ్చు.
టాప్ ప్రైవేట్ మెటల్ క్రెడిట్, డెబిట్ కార్డులు, అధునాతన వేరబుల్స్ మొదలైనవి వీటికి అదనం. ఇక ఎయిర్‌పోర్ట్ లాంజ్, పికప్,డ్రాప్, మీట్ అండ్ గ్రీట్ సర్వీసులు, గ్లోబల్ గోల్ఫ్ ప్రివిలేజెస్ వంటి ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
పయోనీర్ ప్రైవేట్ అనేది హెచ్ఎన్ఐ/యూహెచ్ఎన్ఐ వర్గాల విశిష్ట అవసరాల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఆర్థిక సేవలను అందించేందుకు ఉద్దేశించినది.
“శ్రేష్టత పట్ల మాకున్న నిబద్ధతతో, మా కస్టమర్లకు అందించే బ్యాంకింగ్ సర్వీసుల ప్రమాణాలను మెరుగుపర్చుకోవడంపై నిరంతరం కృషి చేస్తున్నాం.
హెచ్ఎన్‌డబ్ల్యూఐ సెగ్మెంట్ వైవిధ్యమైన అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన ఫైనాన్షియల్, బ్యాంకింగ్ సేవలను అందించేందుకు పయోనీర్ ప్రైవేట్‌ను ఆవిష్కరించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.
ఈ ప్రోగ్రాంతో మా హెచ్ఎన్‌డబ్ల్యూఐ కస్టమర్లకు అసమానమైన అనుభూతిని అందించనున్నాం” అని ఇండస్‌ఇండ్ బ్యాంక్ హెడ్ (అఫ్లుయెంట్ బ్యాంకింగ్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్) సమీర్ దివాన్ తెలిపారు.