Thu. Dec 7th, 2023

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అక్టోబర్ 31,2023: రెండు రోజుల లాభాలకు తెరపడింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం, ముడి చమురు నిల్వలు తగ్గడంతో ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలే అందాయి.

యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లు పెంచే అవకాశం లేనప్పటికీ ఎలాంటి ఔట్‌లుక్ ఇస్తుందోనని ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భౌగోళిక రాజకీయ సమీకరణాలు మారుతుండటంతో అప్రమత్తంగా ఉండటమే మంచిది.

నేడు సెన్సెక్స్ 237, నిఫ్టీ 61 పాయింట్ల మేర పతనమయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఫ్లాట్‌గా 83.26 వద్ద స్థిరపడింది. రియాల్టీ, మీడియా రంగాల్లో కొనుగోళ్ల సందడి కనిపించింది.

క్రితం సెషన్లో 64,112 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 64,449 వద్ద మొదలైంది. 64,452 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. క్రమంగా నష్టాల్లోకి జారుకొని 63,812 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 237 పాయింట్ల నష్టంతో 64,874 వద్ద ముగిసింది.

మంగళవారం 19,232 వద్ద ఆరంభమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,233 వద్ద ఇంట్రాడే గరిష్ఠ స్థాయికి ఎగిసింది. ఆ తర్వాత 19,056 వద్ద ఇంట్రాడే కనిష్ఠ స్థాయికి తగ్గింది. మొత్తంగా 61 పాయింట్లు పతనమై 19,079 వద్ద క్లోజైంది. బ్యాంకు నిఫ్టీ 193 పాయింట్లు ఎరుపెక్కి 42,845 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 50లో 26 కంపెనీలు లాభపడగా 24 నష్టపోయాయి. ఎస్బీఐ లైఫ్, టైటాన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, కొటక్ బ్యాంకు, ఏసియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్‌గా అవతరించాయి. సన్ ఫార్మా, ఎం అండ్ ఎం, ఐచర్ మోటార్స్, ఎల్టీఐ మైండ్ ట్రీ, ఓఎన్జీసీ టాప్ లాసర్స్.

ఫియర్స్ ఇండెక్స్ 2.91 శాతం మేర పెరగడం అప్రమత్తతను సూచిస్తోంది. నేడు నిఫ్టీ బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మెటల్, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎక్కువ నష్టపోయాయి. మీడియా, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు పెరిగాయి.

నిఫ్టీ నవంబర్‌ నెల ఫ్యూచర్స్‌ టెక్నికల్ ఛార్ట్‌ గమనిస్తే 19,300 వద్ద రెసిస్టెన్సీ, 19,100 వద్ద సపోర్టు ఉన్నాయి. నిఫ్టీ నష్టాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, మహీంద్రా అండ్ మహీంద్రాదే ఎక్కువ కాంట్రిబ్యూషన్. సూచీ మరింత కుంగిపోకుండా కొటక్ మహీంద్రా, టైటాన్ సాయపడ్డాయి. ఇన్వెస్టర్లు స్వల్ప కాలానికి జిందాల్‌ సా, పిడిలైట్‌, సీడీఎస్‌ఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లను కొనుగోలు చేయొచ్చు.

టెలికాం మేజర్ భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ అంచనాలకు తగ్గట్టే ఫలితాలు విడుదల చేసింది క్యూ2లో కంపెనీ రెవెన్యూ 1.1 శాతం తగ్గింది. నిర్వాహక ఆదాయం 0.4 శాతం తగ్గి రూ.19,514 కోట్లుగా నమోదైంది. నికర లాభం మాత్రం 37.7శాతం పెరిగి రూ.2,093 కోట్లుగా ఉంది. అదానీ టోటల్ గ్యాస్ అదరగొట్టింది.

ఆదాయం 3.8 శాతం పెరిగి రూ.1095 కోట్లు, నికర లాభం 15 శాతం పెరిగి రూ.172 కోట్లకు చేరుకున్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి జీఈ టీడీ రూ.500 కోట్ల ఆర్డర్ పొందింది. జైడస్ లైఫ్ సైన్సెస్ 68 మిలియన్ పౌండ్లతో లిక్వ్ మెడ్స్ గ్రూప్‌ను కొనుగోలు చేయనుంది.

గెయిల్ క్యూ2 ఆదాయం 15 శాతం తగ్గి రూ.38,680 నుంచి రూ.32,986 కోట్లకు చేరుకుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రెవెన్యూ 9 శాతం తగ్గి రూ.1,98,551 కోట్ల నుంచి రూ.1,79,246 కోట్లకు తగ్గింది. నేడు ప్రైవేటు జీవిత బీమా కంపెనీల షేర్లు లాభపడ్డాయి.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709.