Sat. Jul 20th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నేషనల్,జూన్ 12,2024డీ డెవలప్‌మెంట్ ఇంజినీర్స్ లిమిటెడ్ (Dee Development Engineers Limited) (డీ పైపింగ్ లేదా ది కంపెనీ) తమ ఈక్విటీ షేర్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కి సంబంధించి బిడ్/ఆఫర్‌ను 2024 జూన్ 19 బుధవారం ప్రారంభించనుంది.

మొత్తం ఆఫర్ కింద, తాజాగా రూ. 325 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయడంతో పాటు ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో 45,82,000 ఈక్విటీ షేర్లు విక్రయించబడుతున్నాయి.

ఆఫర్‌లో రూ. 1 కోటి వరకు విలువ చేసే షేర్లు అర్హత కలిగిన ఉద్యోగుల కోసం కేటాయించబడ్డాయి.

యాంకర్ ఇన్వెస్టర్ బిడ్డింగ్ తేదీ 2024 జూన్ 18, మంగళవారంగా ఉంటుంది. సబ్‌స్క్రిప్షన్ కోసం బిడ్/ఆఫర్ 2024 జూన్ 19 బుధవారం నాడు ప్రారంభమై 2024 జూన్ 21 శుక్రవారం నాడు ముగుస్తుంది.

ఆఫర్ ధర శ్రేణీ ఒక్కో షేరుకు రూ. 193 నుంచి రూ. 203 వరకు నిర్ణయించబడింది. కనీసం 73 ఈక్విటీ షేర్లు, ఆ తర్వాత 73 షేర్ల గుణిజాల్లో బిడ్లను దాఖలుచేయొచ్చు.

తాజాగా జారీ చేసిన ఈక్విటీ షేర్ల ద్వారా సమీకరించిన నికర నిధులను కంపెనీ ఈ అవసరాల కోసం వినియోగించుకోవాలని భావిస్తోంది. (i) 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 75 కోట్ల వరకు ఉండే వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం (ii) కంపెనీ తీసుకున్న నిర్దిష్ట రుణాల్లో కొంత భాగం లేదా పూర్తి మొత్తాన్ని చెల్లించడానికి సంబంధించి 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 175 కోట్లను ముందస్తుగా చెల్లించడం లేదా తిరిగి చెల్లించడం కోసం; మిగతా మొత్తం సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించుకోబడుతుంది.

ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించే 45,82,000 ఈక్విటీ షేర్లలో కృషన్ లలిత్ బన్సల్ (“ప్రమోటర్ సెల్లింగ్ షేర్‌హోల్డర్లు” 45,82,000 షేర్ల వరకు విక్రయించనున్నారు.

2024 జూన్ 11న న్యూఢిల్లీలోని ఢిల్లీ అండ్ హర్యానా నేషనల్ క్యాపిటల్ టెరిటరీకి సంబంధించిన రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో కంపెనీ ఆఫర్‌ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ దాఖలుచేయబడింది.

ఈ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ ద్వారా ఆఫర్ చేయబడుతున్న షేర్లను బీఎస్ఈ మరియు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ ఆఫర్‌కి సంబంధిచి ఎన్ఎస్ఈ అధీకృత స్టాక్ ఎక్స్చేంజీగా ఉంటుంది.

ఈ ఆఫర్‌కు ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, ఈక్విరస్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి.

Also read : Dee Development Engineers Limited Initial Public Offer to open on June 19, 2024

Also read :SBI Unveils ‘SME Digital Business Loans’, Revolutionizing MSME Lending Landscape

ఇది కూడా చదవండి : ఈ ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తమ రోటావేటర్ రేంజ్‌ డిమాండ్‌కు తగ్గట్లుగా సన్నద్ధమవుతున్న మహీంద్రా

Also read :Mahindra is Gearing Up for Increased Demand for its Rotavator Range in Telangana and Andhra Pradesh this Kharif Season

Also read :Canon Developing New RF-S7.8mm f/4 STM Dual Lens for EOS R7 Camera for Recording Spatial Video for Apple Vision Pro

Also read : FOGSI releases a comprehensive immunization schedule for adult women and new mothers In India

Also read :Digital The Most Lucrative Channel for FMCG Brands: Meta Studies

Also read : Toshiba Johnson Elevators (India) to supply 60 high-speed ELCOSMO-IIIL elevators to Ultra-luxurious Tulip Monsella

Also read :Wadhwani Foundation, AICTE,and other Top Institutes Collaborate to Boost Research Commercialization in India

ఇది కూడా చదవండి : బంగారు ఆభరణాల దిగుమతిపై నిషేధం విధించిన ప్రభుత్వం..