365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 21, 2025: స్విగ్గీ (Swiggy)ఇన్‌స్టామార్ట్ (Instamart) యాప్‌లలో ‘క్విక్ ఇండియా మూవ్‌మెంట్ సేల్ 2025′(Quick India Movement Sale 2025)ప్రారంభమైంది. ఈ మెగా సేల్(mega sale)సెప్టెంబర్ 28 వరకు కొనసాగనుంది. ఇందులో 50,000 కంటే ఎక్కువ ఉత్పత్తులపై 50శాతం నుంచి 90శాతం వరకు భారీ డిస్కౌంట్లు(discounts)లభిస్తున్నాయి.

10 నిమిషాల్లో డెలివరీ..

యాపిల్, వన్‌ప్లస్, జేబీఎల్ వంటి (Apple, OnePlus, JBL)ప్రముఖ బ్రాండ్స్ ఉత్పత్తులను కొనుగోలుదారులు కేవలం 10 నిమిషాల్లోనే పొందవచ్చు.

ఏమేం ఆఫర్లు..?

ఈ సేల్‌లో వన్‌ప్లస్ 13ఆర్, (Hammer Airflow earbuds) హ్యామర్ ఎయిర్‌ఫ్లో ఇయర్‌బడ్స్ వంటి వాటిపై ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి. వన్‌ప్లస్ 13ఆర్(OnePlus 13R) (12జీబీ + 256జీబీ) వేరియంట్ ₹38,999కు లభిస్తుంది. దీని అసలు ధర ₹44,999. హ్యామర్ ఎయిర్‌ఫ్లో వైర్‌లెస్ ఎయిర్‌బడ్స్ కేవలం ₹349కే పొందవచ్చు.

ఎలక్ట్రానిక్స్ & గాడ్జెట్స్: వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్(OnePlus Nord CE4 Lite) ₹16,999 (అసలు ధర ₹18,999), ఒప్పో కే13ఎక్స్ 5జీ ₹12,499 (అసలు ధర ₹16,999) కు లభిస్తున్నాయి. లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 (Lenovo IdeaPad Slim 3)₹48,999 (అసలు ధర ₹70,790), జేబీఎల్ ఫ్లిప్ 5 బ్లూటూత్ స్పీకర్ సుమారు ₹4,999కు అందుబాటులో ఉన్నాయి.

బ్యాంక్ ఆఫర్లు(Bank offers)..

యాక్సిస్, ఐసీఐసీఐ, ఆర్‌బీఎల్, హెచ్ఎస్‌బీసీ, ఐడీఎఫ్‌సీ, ఏయూ బ్యాంక్ కార్డులతో(Axis, ICICI, RBL, HSBC, IDFC, AU bank cards) కొనుగోలు చేస్తే 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. (Swiggy) స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు (HDFC Bank credit card)పై 10% క్యాష్‌బ్యాక్(cashback) లభిస్తుంది.

https://www.swiggy.com/

వాలెట్ ఆఫర్లు (Wallet offer)..

ఫోన్‌పే, అమెజాన్ పే, సింప్ల్, మొబిక్విక్ (PhonePe, Amazon Pay, Simple, Mobikwik) వంటి వాలెట్ల ద్వారా చెల్లింపులపై కూడా క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు ఉన్నాయి.

ఈ సేల్‌లో ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17(iPhone Air and iPhone 17) వంటి లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటిపై ఎలాంటి తగ్గింపులు లేవు.