365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 14, 2025: భారత కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెండో అతిపెద్ద డైవర్సిఫైడ్ మెడికల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ అయిన ఇంటెగ్రిస్ మెడ్‌టెక్ లిమిటెడ్, తన ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది.

ఈ ఐపీవోలో రూ. 1 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్ల తాజా జారీ ద్వారా రూ. 925 కోట్ల వరకు సమీకరించనుంది, అలాగే ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద రూ. 1 ముఖ విలువ కలిగిన 21,674,531 ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ఓఎఫ్ఎస్‌లో ప్రమోటర్ విక్రయదారులైన ఎవర్‌క్యూర్ హోల్డింగ్స్ Pte. Ltd. నుంచి 15,174,251 షేర్లు, గుర్మీత్ సింగ్ చుగ్ నుంచి 3,250,140 షేర్లు, పునీత శర్మ నుంచి 3,250,140 షేర్లు ఉన్నాయి. బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్ల (BRLMs) సంప్రదింపులతో, కంపెనీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ROC) వద్ద రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (RHP) దాఖలు చేసే ముందు రూ. 185 కోట్ల వరకు ప్రీ-ఐపీవో ప్లేస్‌మెంట్‌ను పరిశీలించవచ్చు.

ఐపీవో నుంచి సమీకరించిన నిధులను ప్రధానంగా కంపెనీ పూర్తి యాజమాన్య సబ్సిడియరీలు,స్టెప్-డౌన్ సబ్సిడియరీలు తీసుకున్న రూ. 696.39 కోట్ల రుణాలను (వడ్డీ ,ప్రీపేమెంట్ ఛార్జీలతో సహా) తిరిగి చెల్లించడానికి లేదా ముందస్తు చెల్లింపుకు ఉపయోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగిస్తారు.

గుర్మీత్ సింగ్ చుగ్, పునీత శర్మ సహ-వ్యవస్థాపకులుగా స్థాపించిన ఇంటెగ్రిస్, కార్డియాలజీ ఉత్పత్తుల అమ్మకాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి, యుకోన్ డ్రగ్ ఎలూటింగ్ స్టెంట్ వంటి అధునాతన తయారీ సాంకేతికతల వైపు అడుగులు వేసింది.

ఇటీవల, 26 సంవత్సరాల అంతర్జాతీయ మెడ్‌టెక్ నాయకత్వ అనుభవం కలిగిన ప్రబీర్ దాస్‌ను సీఈవోగా నియమించుకుంది. ఆయన గతంలో టెరుమో,బెక్టన్ డికిన్సన్ వంటి సంస్థలలో సీనియర్ పాత్రలు నిర్వహించారు.

2019లో ఎవర్‌స్టోన్ క్యాపిటల్ నుంచి పొందిన గ్రోత్ క్యాపిటల్ ద్వారా యూరప్ మరియు లాబొరేటరీ సెక్టార్‌లో వ్యూహాత్మక కొనుగోళ్లు జరిగాయి, ఇవి కాంప్లెక్స్ కరోనరీ ఇంటర్వెన్షన్‌ల కోసం ప్రొప్రైటరీ టెక్నాలజీలను సొంతం చేసుకోవడానికి,సైంటిఫిక్, క్లినికల్ లాబొరేటరీల విస్తరణకు దోహదపడ్డాయి. ప్రస్తుతం, ఇంటెగ్రిస్ ప్రపంచంలో VIVO ISAR, Yukon Choice అనే రెండు డ్రగ్ ఎలూటింగ్ స్టెంట్ ప్లాట్‌ఫామ్‌లను కలిగి ఉన్న ఏకైక సంస్థగా నిలుస్తోంది.

2024లో ట్రాన్స్‌లుమినా GmbH, బ్లూ మెడికల్ డివైసెస్ కొనుగోళ్ల ద్వారా సాంకేతిక విస్తరణ, Lamed GmbH కొనుగోలు ద్వారా భౌగోళిక మరియు కేటగిరీ వైవిధ్యీకరణ, అలాగే రీసెర్చ్ ఇన్‌స్ట్రుమెంట్స్, బయోఫ్రంటియర్, అనలిసా రిసోర్సెస్, సైన్సెస్ రిసోర్సెస్ కొనుగోళ్ల ద్వారా నాయకత్వ బలోపేతం,మార్కెట్ యాక్సెస్ సాధించింది. 2025లో ఎవర్‌లైఫ్ హోల్డింగ్స్ Pte Ltd.లో 100% వాటాలను సొంతం చేసుకుంది.

కార్డియోవాస్కులర్ ,లాబొరేటరీ సొల్యూషన్స్‌లో మొత్తం 17 కొనుగోళ్లు జరిపింది. ఈ “బిల్డ్, పార్టనర్, అండ్ అక్వైర్” వ్యూహం కంపెనీ వృద్ధిని, విస్తరణను, సాంకేతిక లోటును పూరించడాన్ని,ఆవిష్కరణలు,సేవల సరఫరాను బలోపేతం చేసింది.

భారత్ ఆధారిత గ్లోబల్ మెడికల్ ప్రొడక్ట్స్,లాబొరేటరీ సొల్యూషన్స్ కంపెనీగా, ఇంటెగ్రిస్ రెండు ప్రధాన మెడ్‌టెక్ సెగ్మెంట్‌లలో పనిచేస్తుంది: కార్డియోవాస్కులర్ డివైసెస్ (డ్రగ్-ఎలూటింగ్ స్టెంట్స్, డ్రగ్-కోటెడ్ బెలూన్స్, కాంప్లెక్స్ కరోనరీ ఇంటర్వెన్షన్ ప్రొడక్ట్స్, వాస్కులర్ యాక్సెస్ సొల్యూషన్స్),క్లినికల్, రీసెర్చ్, ఇండస్ట్రియల్ లాబొరేటరీల కోసం లాబొరేటరీ సొల్యూషన్స్.

భారతదేశంలో రెండో అతిపెద్ద కరోనరీ స్టెంట్ తయారీ సంస్థగా, డ్రగ్-ఎలూటింగ్ స్టెంట్స్‌లో సుమారు 22.0% మార్కెట్ వాటాను కలిగి ఉంది మరియు ఆగ్నేయాసియాలో అతిపెద్ద సైంటిఫిక్ లాబొరేటరీ సొల్యూషన్స్ కంపెనీగా నిలుస్తోంది. భారత్, యూరప్, ఆసియా (భారత్ మినహా), రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ (మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, లాటిన్ అమెరికా) అనే నాలుగు ప్రధాన మార్కెట్లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారత్‌లోని డెహ్రాడూన్, జర్మనీలోని హెచింగెన్, నెదర్లాండ్స్‌లోని హెల్మండ్‌లలో ఐదు తయారీ కేంద్రాలు ఉన్నాయి, 65కి పైగా అంతర్జాతీయ మార్కెట్లకు ఉత్పత్తులను సరఫరా చేస్తోంది.

మూడు తరగతుల మెడికల్ డివైసెస్‌ను ఉత్పత్తి చేసే రెండు భారతీయ కంపెనీలలో ఇంటెగ్రిస్ ఒకటి, డెహ్రాడూన్, హెచింగెన్, హెల్మండ్‌లలోని సౌకర్యాలలో 2,500కు పైగా SKUలను తయారు చేస్తుంది.

2025 జూన్ 30 నాటికి, ఇంటెగ్రిస్ 2,000కి పైగా హాస్పిటల్స్ మరియు కాథ్ లాబ్‌లతో భాగస్వామ్యం కలిగి ఉంది.ప్రపంచవ్యాప్తంగా 9,500 లాబొరేటరీలకు సేవలు అందిస్తూ, 200కి పైగా బ్రాండ్‌లలో 22,000 SKUలను అందిస్తోంది.

దాని లాబ్ సొల్యూషన్స్ సెగ్మెంట్ యూరోఇమ్యూన్, బయోరాడ్, బయోమెరియక్స్, MGI వంటి 200కి పైగా గ్లోబల్ తయారీదారులను ప్రాతినిధ్యం వహిస్తూ, భారత్, ఆగ్నేయాసియా లోని క్లినికల్,సైంటిఫిక్ లాబ్‌లకు సేవలు అందిస్తోంది.

కంపెనీ ఆదాయంలో 60% కంటే ఎక్కువ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తుంది, ఇది కార్డియోవాస్కులర్, సైంటిఫిక్ లాబ్ సొల్యూషన్స్, క్లినికల్ డయాగ్నోస్టిక్స్ వర్టికల్స్‌లో గ్లోబల్ పోర్ట్‌ఫోలియో ద్వారా సాధ్యమైంది.

2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,582.25 కోట్ల ఆదాయం నుంచి 2025ఆర్థిక సంవత్సరంలో 23.85% వృద్ధితో రూ. 1,959.58 కోట్లకు చేరింది. రీస్టేటెడ్ లాభం రూ. 4.8 కోట్ల నష్టం నుంచి రూ. 70.6 కోట్ల లాభంగా మారింది, అడ్జస్టెడ్ PAT రూ. 21.4 కోట్ల నుంచి రూ. 103 కోట్లకు పెరిగింది.

ఈ ఐపీవోకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ICICI సెక్యూరిటీస్ లిమిటెడ్, యాక్సిస్ క్యాపిటల్ లిమిటెడ్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, IIFL క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ (గతంలో IIFL సెక్యూరిటీస్ లిమిటెడ్) ఉన్నాయి.