Fri. Nov 8th, 2024
Pjtsau

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 3, 2023: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్ లో అంతర్ కళాశాలల క్రీడలు, లలిత కళలు, సంస్కృతిక పోటీలు రేపు ప్రారంభం కానున్నాయని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సి. నరేంద్ర రెడ్డి తెలిపారు.

ఈ పోటీల్లో విశ్వవిద్యాలయంలోని వివిధ కళాశాలలు అయిన వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పాలెం, వరంగల్, అశ్వారావుపేట, కమ్యూనిటీ సైన్స్ కళాశాల, సైఫాబాద్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కళాశాల, సంగారెడ్డి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల, రుద్రూరు పాల్గొననున్నాయని తెలిపారు.

Pjtsau365telugu

అంతేకాకుండా వివిధ రకాల క్రీడలైన క్రికెట్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, కారమ్స్, చెస్, షటిల్ బ్యాడ్మింటన్, ఫుట్ బాల్, వివిధ రకాల ఆటలైన రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో, షాట్ పుట్, 4×100 మీటర్ రిలే,

వివిధ రకాల సాంస్కృతిక పోటీలైన సోలో సాంగ్, గ్రూప్ సాంగ్, సోలో డాన్స్, గ్రూప్ డాన్స్, మొనో ఆక్షన్, మైమ్, స్కిట్, సాహిత్యపరమైన పోటీలైనటువంటి వ్యాసరచన, ఉపన్యాస, డిబేట్, క్విజ్ వివిధ రకాలైన సృజనాత్మక పోటీలయినటువంటి రంగోలి, స్పాట్ పెయింటింగ్, కార్టూన్ మేకింగ్, కొల్లేజ్ పోస్టర్ మేకింగ్ నిర్వహించబోతున్నట్లుగా తెలియజేయడం జరిగింది.

ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల మధ్య పోటీ వాతావరణాన్ని పెంపొందించి, సుహృద్భావ వాతావరణం లో విద్యార్థులు పాల్గొనడం ద్వారా మానసిక వికాసానికి తోడ్పడుతుందని తెలియజేశారు.

error: Content is protected !!