Sun. Dec 1st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 19,2024: రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో ఈరోజు విద్యార్థుల అంతర్ కళాశాలల క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ జెల్లా సత్యనారాయణ హాజరై క్రీడా పోటీలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఏ పోటీలోనైనా గెలుపోటములు సహజం. ప్రధానంగా, విద్యార్థుల మధ్య స్నేహభావం నెలకొల్పడమే ముఖ్య ఉద్దేశ్యం. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యే అవకాశముంటుంది” అని తెలిపారు.

విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డీ. శివాజీ మాట్లాడుతూ, “క్రీడల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు,ఆత్మస్థైర్యం పెంపొందుతాయి. క్రీడలలో గెలుపోటములు ముఖ్యం కాదు, ముఖ్యమైనది పాల్గొనడం” అన్నారు. డీన్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ, “క్రీడలు ప్రతిభను ,నైపుణ్యాలను ప్రదర్శించడానికి చక్కని వేదిక” అని పేర్కొన్నారు.

రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సి. నరేంద్రరెడ్డి స్వాగత ప్రసంగంలో, విద్యార్థులు క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి ,సమగ్ర అభివృద్ధి కోసం క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. యూనివర్సిటీ అబ్జర్వర్, ఫిజికల్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ జె. సురేష్ మాట్లాడుతూ, “ఈ క్రీడలు సృజనాత్మకతను, ప్రతిభను వెలికి తీసేందుకు ఒక గొప్ప అవకాశం” అని అభిప్రాయపడ్డారు.

క్రీడలను నిర్వహించడానికి సహకరించిన ఉపకులపతి ప్రొఫెసర్ అల్ధాస్ జానయ్యకు, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి శాంతి కపోతాలను ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ పోటీల్లో విశ్వవిద్యాలయ పరిధిలోని 11 కళాశాలల నుంచి 450 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. బాలుర కోసం 10 ఈవెంట్లు, బాలికల కోసం 9 ఈవెంట్లు నిర్వహించనున్నారు. చివరగా, ఆఫీసర్ ఇన్‌ఛార్జి ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ పి. ప్రశాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

error: Content is protected !!