Fri. Oct 11th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, సెప్టెంబర్ 27, 2024:తిరుమల యాత్ర, టీటీడీ డిక్లరేషన్, మతపరమైన అంశాలపై వ్యతిరేక ప్రకటనల మధ్య తాజాగా తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా జగన్ తిరుమల యాత్రకు సంబంధించి డిక్లరేషన్ అంశం చర్చనీయాంశం కాగా, టీటీడీ ఈ విషయాన్ని స్వయంగా పరిష్కరించుకోవాల్సిన అంశమని కూటమి పక్షాలు పేర్కొన్నాయి.

జగన్ మతపరమైన విషయాలపై చర్చ అవసరం లేదని, వ్యక్తులను,అన్య మతాలను లక్ష్యంగా చేసుకోవడం అనవసరమని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.

టీటీడీ ప్రసాదం అపవిత్రతపై ప్రశ్నలు:

తిరుమల మహా ప్రసాదం లడ్డూ తయారీలో జంతు అవశేషాలు కలిపిన నెయ్యి వినియోగించి అపవిత్రతకు గురిచేశారనే ఆరోపణలు పుట్టుకొస్తున్నాయి. ఈ అంశంలో టీటీడీ బోర్డు సభ్యులు, వారి నిర్ణయాలు ప్రధాన కారణమని, వారు జవాబుదారీ తీరుతో వ్యవహరించాలని పలువురు హిందూ మత పెద్దలు వాదిస్తున్నారు.

ఇంతటి పవిత్రమైన ప్రసాదం మీద కల్తీ ఆరోపణలు రావడంతో హిందువుల మనోభావాలు దెబ్బతినాయని, ఈ విషయంలో గత టీటీడీ బోర్డులు,ఉన్నతాధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు.

మతమంటలను రెచ్చగొట్టడంపై ఆరోపణలు:

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తుని ఘటన, అధికారంలోకి వచ్చిన తరువాత కోనసీమ ఘటనలతో కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించింది. ఇప్పుడు మతాల మధ్య గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటోంది.

తిరుమల డిక్లరేషన్‌పై క్లారిటీ:

తిరుమల యాత్రకు వెళ్తున్న సీఎం జగన్ డిక్లరేషన్ తీసుకోవాలా లేదా అనేది టీటీడీ వ్యవహారమని, కూటమి పక్షాలు ఈ విషయంలో ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని పలువురు పేర్కొన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు,పోలీసులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

error: Content is protected !!