365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు6,2023: అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం 2023ఇయర్ థీమ్ “స్నేహం ద్వారా మానవ స్ఫూర్తిని పంచుకోవడం. ఏటా ఆగస్టు మొదటి ఆదివారం నాడు స్నేహితుల దినోత్సవం జరుపుకుంటారు. ఈ సంవత్సరం, ఇది ఆగస్టు 6న వచ్చింది.
లోపాలను సరి చేసేదే నిజమైన స్నేహమని డా.హిప్నోకమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ డైరెక్టర్ డా.హిప్నో పద్మా కమలాకర్ అన్నారు. ఆదివారం అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ముషీరాబాద్ లో ప్రభు త్వబాలికల హాస్టల్లో నవభారత లయన్స్ క్లబ్, డా.హిప్నోకమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ ఆధ్వర్యంలోఫ్రెండ్షిప్ డే లెలెబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు.
బాలికలకు పోషకాహారం, కథలు, పాటలు, గొప్ప వ్యక్తుల పుస్తకాలు, పెన్సిల్, ఎరేజర్లు అందజేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ స్నేహం మానవ సంబంధాల నిజమైన రూపమని తెలిపారు. ఏమైంది అని అడిగేవారు, ఏమి కాదులే అని చెప్పే వారు స్నేహితులన్నారు.
కులం, మతం, రంగు, వయస్సు, జాతితో సంబంధం లేకుండా స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవడం ఈ రోజు ప్రత్యేకత అని అన్నారు. స్నేహం అనేది ఇతరుల పట్ల దయ, సద్భావనతో, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, అభినందనలు ఇవ్వడం లేదా కృతజ్ఞతలు తెలియజేయడం వంటివి చేయాలని ఆమె కోరారు.
అందమైన స్నేహం ఎప్పటికీ అలాగే ఉంటుందని, మన ప్రతి అడుగులో విశ్వసించగలిగే వ్యక్తే స్నేహితుడు అని డా.హిప్నో పద్మా కమలాకర్ అన్నారు. క్లాసులోనూ, చుట్టుపక్కల ఉన్న వ్యక్తులే స్నేహితులను కోకూడదని, మంచి సోదరిగా, సోదరుడిగా, కుమార్తెగా, కొడుకుగా కుటుంబంలోనూ స్నేహ సంబంధాలు ఏర్పరుచుకోవాలని తెలిపారు.
ఎన్ని సమస్యలు ఉన్నా,వచ్చినా ఎప్పటికీ విడిచిపెట్టని వారే నిజమైన స్నేహితులని, స్నేహితులనే వారు పెన్సిల్, ఎరేజర్ లా ఉండాలని డా.హిప్నో పద్మా కమలాకర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో నవభారత లయన్స్ క్లబ్ జోనల్ చైర్ పర్సన్ సి.హెచ్.గోపాలకృష్ణ, క్లబ్ అధ్యక్షుడు బెల్లం కొండ వినయ్,సైకాలజిస్ట్ నితీష్,జి.హిమకర్, హాస్టల్ హెడ్ బాపు ప్రియ పాల్గొన్నారు.