techwave

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,19నవంబర్,2022: ప్రముఖ గ్లోబల్ ఐటి,ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ టెక్‌వేవ్ ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంది.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవంలో భాగంగా, టెక్‌వేవ్ ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి పురుషుల ఆరోగ్యం గురించి ప్రపంచ స్థాయిలో అవగాహన కల్పించడానికి ,పురుషుల శ్రేయస్సు గురించిన కార్యక్రమాలు చేపట్టింది. పురుషుల ఆరోగ్యం, సానుకూల వ్యక్తీకరణలను పెంపొందించే లక్ష్యంతో అన్ని వయసుల విభిన్న నేపథ్యాల పురుషులు పాల్గొన్నారు.

ప్రోస్టేట్ క్యాన్సర్, వృషణ క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలను హైలైట్ చేయడానికి పురుషులు మీసాలు పెంచే ఒక నెల రోజుల కార్యక్రమం “మూవంబర్” కారణంగా నవంబర్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పురుషుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, అవగాహన పెంచడం, సంక్షోభాలను తగ్గించడం,ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా పురుషుల ఆరోగ్యం,శ్రేయస్సు కోసం పనిచేసే ప్రముఖ స్వచ్ఛంద సంస్థ మూవెంబర్‌తో టెక్‌వేవ్ సహకరించింది.

techwave

ది మూవెంబర్ ఫౌండేషన్ కోసం నిధులను సేకరించేందుకు పలువురు ఉద్యోగులు ఈ సందర్భంగా మీసాలు పెంచారు. Movemberతో కలిసి, Techwave ప్రోస్టేట్ క్యాన్సర్, వృషణ క్యాన్సర్, ఆత్మహత్యల నివారణ గురించి అవగాహన పెంచడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సమగ్ర విధానాన్ని ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురుష ఉద్యోగుల విజయాలు ,సహకారాన్ని గుర్తించింది టెక్‌వేవ్‌. రోజంతా అన్ని వయసుల పురుషులతో కూడిన విభిన్న సమూహం సరదా గేమ్‌లలో నిమగ్నమై, పురుషుల మానసిక , శారీరక శ్రేయస్సుపై దృష్టి సారించే గ్లోబల్ ప్యానెల్ చర్చలో పాల్గొన్నారు, వైవిధ్యాన్ని జరుపుకుంటారు. అంతేకాదు వారి విజయాలను పంచుకున్నారు. వర్చువల్ ఈవెంట్‌లో వివిధ రంగాలకు చెందిన నాయకుల జీవిత కథలు, అనుభవాలను పంచుకుంది.

techwave

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా టెక్‌వేవ్ సీఈవో రాజ్ గుమ్మడపు మాట్లాడుతూ “అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకోవడం మాకు సంతోషంగా, గర్వంగా ఉంది. ఇది మానవాళి అడ్డంకులను అధిగమించడానికి, మూస పద్ధతులను తొలగించడానికి అంకితం చేసిన రోజు. అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, పురుషుల సమస్యలపై అవగాహన కల్పించడానికి ,ప్రాథమిక మానవతా విలువలను ప్రోత్సహించడానికి మేము ‘మూవెంబర్’తో భాగస్వామ్యం చేసాము అని ఆయన అన్నారు.

ఈ చొరవ టెక్‌వేవ్ అసోసియేట్‌లకు స్వీయ-అవగాహనను పెంపొందించు కోవడానికి, సెలెబ్రేట్ చేసుకోవడానికి వారి విజయాల గురించి మాట్లాడటానికి సానుకూల విధానాన్ని పెంచడానికి శక్తినిస్తుందని మా ఆశ” అని టెక్‌వేవ్ సీఈవో రాజ్ గుమ్మడపు పేర్కొన్నారు.