365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, 22 జూన్ 2023: అంతర్జాతీయం యోగా దినోత్సవం నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఘనంగా జరిగింది. “విశ్వమంతా ఆశించే ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు యోగా ఒక చిహ్నం. ఇది జీరో బడ్జెట్‌తో ఆరోగ్య హామీ.” ప్రధాని నరేంద్ర మోదీ.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా డీపీఎస్‌ నాచారంలో 5, 6వ తరగతి విద్యార్థులకు ఉత్సాహభరితమైన వేడుకలు నిర్వహించింది యాజమాన్యం.

‘ఒక భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తు’ కోసం సామూహిక ఆకాంక్షను ప్రతిబింబించేలా ‘వసుధైవ కుటుంబానికి యోగా’ అనే ఈ సంవత్సరం థీమ్‌ను దృష్టిలో ఉంచుకుని యోగా గురువుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు యోగా భంగిమలను అభ్యసించారు.

వేడి వాతావరణం కారణంగా విద్యార్థులు తమ తరగతి గదులు,ప్రధాన బ్లాక్‌లోని సమావేశ మందిరాల్లో యోగా చేశారు. సీనియర్ ప్రిన్సిపాల్ శ్రీమతి సునీతరావు విద్యార్థులందరినీ ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు.

ఆమె ఈసందర్భంగా యోగా ప్రాముఖ్యతను గురించి తెలిపారు. ముఖ్య అతిథి, ఇషా యోగా ఫౌండేషన్‌కు చెందిన శ్రీ భార్గవ్ శేషం.. సద్గురువు 12 నిమిషాల క్రియను ప్రదర్శించే వీడియోతో విద్యార్థులకు జ్ఞానోదయం కలిగించారు.

మొత్తం కార్యక్రమం శారీరక ,మానసిక శ్రేయస్సు ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించింది. ఇది విద్యార్థుల జీవితంలో యోగాను అన్వేషించే సాధన చేసే వారి ప్రయాణాన్ని కొనసాగించడానికి వారిని ప్రేరేపించింది.