![techwave](http://365telugu.com/wp-content/uploads/2022/06/techwave-1-1.png)
365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,ముంబయి, జూన్ 21, 2022: 8వ అంత ర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రముఖ గ్లోబల్ ఐటీ, ఇంజినీరింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన టెక్‌వేవ్ సంస్థ తన ఉద్యోగుల కోసం వర్చువల్ హెల్త్ అండ్ వెల్‌నెస్ ప్రోగ్రామ్‌ను నిర్వహించింది.ఈ యోగా సెషన్‌కు టెక్‌వేవ్ సహ వ్యవస్థాపకుడు ,సీఈఓ రాజశేఖర్ గుమ్మడపు నాయ కత్వం వహించగా, టెక్‌వేవ్ చైర్మన్ దామోదర్ రావు గుమ్మడపు, యోగా శిక్షకులు పర్యవేక్షించారు.
![techwave](http://365telugu.com/wp-content/uploads/2022/06/techwave-.png)
ఈ వర్చువల్ యోగా వేడుకల్లో సంక్లిష్టమైన భంగిమల్లో తమ శరీరాలను వంచారు. కొన్ని వార్మప్, లోతైన శ్వాస వ్యాయామాలు, ధ్యానం చేశారు. తమ సిబ్బంది ఆరోగ్యం, వెల్నెస్ కోసం టెక్‌వేవ్ నిబద్ధతలో భాగంగా, ప్రతి వారం కార్యాలయంలో ప్రత్యేకంగా దృష్టిసారించిన హెల్త్ ప్రోగ్రామ్స్ ను ప్రోత్సహించడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
![techwave](http://365telugu.com/wp-content/uploads/2022/06/techwave-1-1.png)
ఈ సందర్భంగా టెక్‌వేవ్ సహ వ్యవస్థాపకుడు,సీఈఓ రాజశేఖర్ గుమ్మడపు మాట్లాడుతూ, “టెక్‌వేవ్‌లో, మనస్సు, శరీరం, ఆత్మ, ఐక్యత ప్రాముఖ్యతను, వ్యక్తులు వారి నిజమైన స్థితిని పొందేందుకు శక్తివంతం చేయడంలో దాని పాత్రను మేము బలంగా విశ్వసిస్తాము. మా సహచరులందరి మానసిక ,శారీరక శ్రేయస్సు మాకు ప్రధానమైనది మా సిబ్బందిని ఆరోగ్యంగా సంతోషంగా ఉంచడానికి పెద్ద ఎత్తున వర్చువల్ చేయడం పట్ల నేను గర్విస్తున్నాను” అని ఆయన అన్నారు.