365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 9,2025: ఈ అమూల్యమైన మాటలతో స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి, మన భవిష్యత్తును మరింత శోభాయమానం చేసుకోవడానికి ఇప్పుడే ఆధ్యాత్మిక సాధన ప్రారంభించడం ఎంత కీలకమో తెలియజేశారు. ఇది మనల్ని ఉన్నతమైన ప్రయత్నాలకు పురిగొల్పే పిలుపు.

అంతేకాదు, ఆయన సంక్షిప్తంగా ఇలా అన్నారు: “దైవసాక్షాత్కారం పొందడమంటే అన్ని దుఃఖాలకీ అంత్యక్రియ జరిపించడమే.” ఎంతటి గొప్ప వాగ్దానం! భగవంతుని అన్వేషణలో దుఃఖరహితమైన, ఆనందమయమైన జీవితం సాధ్యమని ఆయన భరోసా ఇచ్చారు.

శ్రీయుక్తేశ్వర్ గిరి 1855 మే 10న పశ్చిమ బెంగాల్‌లోని శ్రీరాంపూర్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు ప్రియనాథ్ కరార్. ఆయన తండ్రి ఒక సంపన్న వ్యాపారవేత్త. వారణాసిలోని మహాఋషి లాహిరీ మహాశయుల శిక్షణలో ఆయన జ్ఞానసంపన్నులై, జ్ఞానావతారుల స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత ఆయన గిరి శాఖకు చెందిన స్వామిగా మారారు.

ఇది కూడా చదవండి…భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తత: పేలుళ్ల పరిస్థితిని సమీక్షించనున్న జమ్మూసీఎం ఒమర్ అబ్దుల్లా..

This is also read.. Lakshmi’s Salon & Academy Launches Its First Branch at RK Puram, Kothapet

మహావతార్ బాబాజీ, భవిష్యత్తులో శ్రీ శ్రీ పరమహంస యోగానందగా ప్రసిద్ధి చెందిన ముకుందలాల్ ఘోష్‌ను శ్రీరాంపూర్‌లోని శ్రీయుక్తేశ్వర్ ఆశ్రమంలో ప్రత్యేక శిక్షణ కోసం వెళ్లమని నిర్దేశించారు.

వారణాసి వీధుల్లో మొదటిసారి శ్రీయుక్తేశ్వర్‌ను కలిసిన క్షణమే యోగానంద ఆయనతో తనకున్న రహస్యమైన అనుబంధాన్ని గుర్తించారు. తన అనేక ధ్యానాలలో దర్శించిన గురువు చివరకు ప్రత్యక్షంగా కనిపించారని ఆయన గ్రహించారు.

తన గురువు శ్రీయుక్తేశ్వర్ ద్వారా శిక్షణ పొందిన యోగానంద, ప్రపంచానికి అత్యున్నతమైన ప్రాచీన భారతీయ ధ్యాన ప్రక్రియ అయిన క్రియాయోగాన్ని పరిచయం చేసి, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఆధ్యాత్మిక గురువుగా ఎదిగారు. యోగానంద రచించిన ఆధ్యాత్మిక గ్రంథం “ఒక యోగి ఆత్మకథ” ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసింది.

50కి పైగా భాషల్లోకి అనువదించనుంది. తన గురువు పాదాల చెంత పొందిన జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి ఆయన 1917లో భారతదేశంలోని రాంచీలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (YSS)ని,1920లో లాస్ ఏంజెలిస్‌లో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (SRF)ని స్థాపించారు.

శ్రీయుక్తేశ్వర్ ఒక కఠినమైన క్రమశిక్షణ కలిగిన గురువు. ఆయన స్వయంగా ఇలా అన్నారు: “నా దగ్గరికి శిక్షణకు వచ్చిన వారి విషయంలో నేను కఠినంగా ఉంటాను, అది నా పద్ధతి. దాన్ని అంగీకరించండి లేదా వదిలివేయండి; అందులో నేను రాజీపడను.”

This is also read.. Wonderla Celebrates Mother’s Day with Free Entry for Moms, Invites Families to Make Memories Together

అయితే అదే సమయంలో, ఒక తల్లి తన పిల్లల పట్ల చూపించేంత గాఢమైన ప్రేమను ఆయన తన శిష్యులపై చూపేవారు. యోగానంద తన ఆత్మకథలోని 12వ అధ్యాయంలో, తన దివ్య గురువు డేగ కంటి వంటి పర్యవేక్షణలో, ఆయన క్రమశిక్షణ అనే సుత్తి బరువు కింద తాను అనేకసార్లు బాధపడినప్పటికీ, ఆధ్యాత్మికంగా తాను ఎలా పరిణతి చెందారో వివరించారు.

“నా గర్వాన్ని సుత్తి దెబ్బలతో అణిచివేసినందుకు నేను ఆయనకు ఎంతో కృతజ్ఞుడిని. అలంకారికంగా చెప్పాలంటే, నా దవడలోని ప్రతి కుళ్లిపోయిన పన్నును ఆయన కనిపెట్టి తీస్తున్నారని ఒక్కొక్కప్పుడు నాకు అనిపించేది.”

ఆధ్యాత్మికంగా అంతటి ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ, శ్రీయుక్తేశ్వర్ చాలా సాదాగా, వినయంగా ఉండేవారు. తన గొప్పదనాన్ని కానీ, తన అంతర్గత వైరాగ్యాన్ని కానీ గొప్పగా బయటకి ప్రదర్శించడం ఆయనకు తెలియదు. అనంత పరమాత్మ పట్ల ఆయనకు ఉన్న లోతైన అవగాహన ఆయన అలవాటైన మౌనంలోనూ, జ్ఞానంతో నిండిన ఆయన ప్రతి మాటలోనూ ప్రతిబింబించేది.

యోగానంద భక్తితో ఇలా అన్నారు, “సజీవంగా ఆవిర్భవించిన పరమేశ్వర సన్నిధిలో ఉన్నాననే స్పృహ నాకు ఎప్పుడూ ఉండేది. ఆయన దివ్యత్వం యొక్క భారం, ఆయన ఎదుట ఎల్లప్పుడూ నా తల వంగేలా చేసేది.”

ఆయన ధార్మిక గ్రంథాల వ్యాఖ్యానంలో సాటిలేని వ్యక్తి అని తెలిసిన మహావాతార్ బాబాజీ, క్రీస్తు బోధనలు ,శ్రీకృష్ణుడి బోధనలకు గల సారూప్యతను వివరిస్తూ ఒక చిన్న పుస్తకం రాయమని శ్రీయుక్తేశ్వర్‌ను కోరారు. దాని ఫలితంగా ఆయన “ద హోలీ సైన్స్” (కైవల్యదర్శనం) అనే అద్భుతమైన పుస్తకాన్ని రచించారు. ఇది 1894లో ప్రచురితమైంది.

“రాజతేజస్సుతో ప్రకాశిస్తున్న మా గురుదేవుల మనస్సు కీర్తి మీద కానీ, లౌకిక లాభాల మీద కానీ కేంద్రీకరించి ఉంటే, ఆయన సులభంగా ఒక చక్రవర్తిగానో, ప్రపంచాన్ని వణికించే యోధుడిగానో ఉండేవారని” యోగానంద తరచుగా అనుకునేవారు. “అలా కాకుండా, ఆయన కోపం, అహంకారం అనే అంతర్గత దుర్గాలను కూలదోయడానికి ప్రయత్నించారు; వాటి పతనమే మానవుడి నిజమైన గొప్పతనానికి నిదర్శనం.”