365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,నవంబర్ 13,2023:దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంకింగ్ మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి.
బెంచ్‌మార్క్ బీఎస్ఈ నిఫ్టీ 19,500, సెన్సెక్స్ 65,000 దిగువన ముగిశాయి. ప్రపంచ వ్యాప్తంగా రెండు యుద్ధాలు జరుగుతుండటం, భౌగోళిక రాజకీయ అంశాలు వేగంగా మారుతుండటం, మంగళవారం అమెరికా ద్రవ్యోల్బణం డేటా విడుదల, ఈ వారం జో బైడెన్ – జిన్‌పింగ్ సమావేశం ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు వరుసగా 14వ రోజు నెట్ సెల్లర్స్‌గా అవతరించారు. నేడు రూ.1244 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. డొమస్టిక్ ఇన్వెస్టర్లు రూ.830 కోట్లతో నెట్ బయర్స్‌గా మారారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.33 వద్ద ఫ్లాట్‌గా స్థిరపడింది.
క్రితం సెషన్లో 65,259 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 65,158 వద్ద మొదలైంది. 65,176 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు నష్టాల్లోకి జారుకుంది. 64,853 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది.
చివరకు 325 పాయింట్ల నష్టంతో 64,933 వద్ద ముగిసింది. సోమవారం 19,486 వద్ద ఆరంభమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,494 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మరికాసేపటికే 19,414 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది.
మొత్తంగా 82 పాయింట్లు పతనమై 19,443 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంకు 105 పాయింట్లు కుంగి 43,891 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 50లో 13 కంపెనీలు లాభపడగా 36 నష్టపోయాయి. కోల్ ఇండియా, ఐచర్ మోటార్స్, హిందాల్కో, ఎం అండ్ ఎం, బీపీసీఎల్ టాప్ గెయినర్స్. ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్, ఇన్ఫీ, నెస్లే ఇండియా టాప్ లాసర్స్.
నేడు పీఎస్‌యూ బ్యాంకు సూచీ ఏకంగా 2.64 శాతం ఎగిసింది. ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు తీవ్రంగా నష్టపోయాయి.
నిఫ్టీ నవంబర్ ఫ్యూచర్స్ టెక్నికల్ ఛార్ట్‌ను పరిశీలిస్తే 19,550 వద్ద రెసిస్టెన్సీ, 19,400 వద్ద సపోర్ట్ ఉన్నాయి. ఇన్వెస్టర్లు నియర్ టర్మ్‌లో ఇండస్ ఇండ్ బ్యాంకు, బీపీసీఎల్, ఇండియన్ బ్యాంకు, పీఎఫ్‌సీ షేర్లను కొనొచ్చు.
నేటి నిఫ్టీ నష్టాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ కీలకంగా మారాయి.గ్లెన్‌మార్క్ ఫార్మా షేర్లు నేడు ఐదు శాతం మేర నష్టపోయాయి. రెండో త్రైమాసికం ఫలితాలు అంచనాల మేరకు లేకపోవడమే ఇందుకు కారణం.
ఆదాయం కేవలం 6.3 శాతం పెరిగి రూ.3207 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే సమయంలో రూ.278 కోట్ల లాభం ఆర్జించిన కంపెనీ ఇప్పుడు రూ.61 కోట్ల మేర నష్టపోయింది.
సిగాచీ ఇండస్ట్రీస్ షేర్లు చివరి ఆరు సెషన్లలోనే 24 శాతం మేర పెరిగాయి. రేట్ గెయిన్ ట్రావెల్ టెక్, టొరెంట్ పవర్ సరికొత్త జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 లైఫ్ టైమ్ హై 12,739ని టచ్ చేసింది.
ఆల్కెమ్, అరబిందో ఫార్మా, కెనరా బ్యాంకు, పవర్ గ్రిడ్, ట్రెంట్ షేర్లు 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి. అంచనాలను అందుకోలేకపోవడంతో బయోకాన్ షేర్లు నాలుగు శాతం పడిపోయాయి.
- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709