Thu. Nov 7th, 2024
Apple iphone new updates

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబై ,సెప్టెంబర్ 20,2022: Apple ఇటీవల Apple iPhone వినియోగదారుల కోసం iOS 16ని కొత్త Apple iPhone 14, Apple iPhone 14 Pro అండ్ Apple iPhone 14 Proతో పాటు విడుదల చేసింది.The Wall Street Journal తాజా నివేదిక ప్రకారం..టెక్ దిగ్గజం దీని కొత్త అప్డేట్ ను విడుదల చేయనుంది. తాజా ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చే వారంలో అందు బాటులోకి రానుంది. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ మొదటి పబ్లిక్ రిలీజెస్ తరచుగా కొన్నిబగ్‌లను కలిగి ఉంటాయి.

iOS 16 మినహాయింపు కాదు. గత కొన్ని రోజులుగా, Apple iPhone వినియోగ దారులు థర్డ్-పార్టీ కెమెరా యాప్‌లు, క్లిప్‌బోర్డ్ అనుమతి ప్రాంప్ట్‌లతో సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ అనేక నివేదికలు ఇచ్చింది. నివేదిక ప్రకారం iOS 16 అప్డేట్ ఈ సమస్యలను పరిష్కరిస్తుందని భావిస్తున్నారు. Apple iPhone 14 Pro మోడల్‌లలో మరొక ఐఫోన్ నుంచి డేటా బదిలీ తర్వాత డివైస్ ఫ్రీజ్ అవ్వడం వంటి కొన్ని ప్రధాన సమస్యలు తలెత్తుతున్నాయి.

Apple iphone new updates

ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, టిక్‌టాక్‌తో సహా యాప్‌లలో ఉపయో గించినప్పుడు కెమెరా మాడ్యూల్ వణుకుతున్నట్లు ప్రో ఐఫోన్ వినియోగదారులుపేర్కొన్నారు. Apple క్లెయిమ్‌లపై పబ్లిక్ స్టేట్‌మెంట్‌ను విడుదల చేయలేదు, అయినప్పటికీ, MacRumors నివేదిక కంపెనీ iOS 16.0.2ని త్వరలో విడుదల చేసే అవకాశం ఉందని సూచిస్తుంది. “సమస్య గురించి మాకు తెలుసు. వచ్చే వారం ఈ సమస్యలకు సరైన పరిష్కారం విడుదల చేస్తామని Apple ప్రతినిధి MacRumors కి చెప్పారు.

error: Content is protected !!