Thu. Dec 26th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, 6th మే 2022: ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్ సొసైటీ లిమిటెడ్ (“IPRS”) తమ సభ్యుల సంక్షేమం గురించి ఎల్లప్పుడూ శ్రద్ధ వహిస్తుంది. IPRS తమ ప్రారంభ సంవత్సరం 1969 నుండి స్వరకర్తలు, పాటల రచయితలు, ప్రచురణకర్తల హక్కులను పరిరక్షిస్తోంది. ప్రతిభావంతులైన క్రియేటర్లు తమ హక్కులు, అవకాశాల గురించి సరైన అవగాహన లేక బాధపడటం నిజంగా కలవరపెడుతుంది. పరిస్థితిని సరిదిద్దడానికి అవసరమైన దిద్దుబాటు చర్యల గురించి వారిని ఆలోచించేలా చేస్తుంది.

బాధ్యతాయుతమైన కాపీరైట్ సొసైటీగా, మహమ్మారి సమయంలో తమ సభ్యులు ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం గురించి IPRSకి బాగా తెలుసు. వేగంగా మారుతున్న ఈ సంగీత ప్రపంచంలో, సొసైటీ దాని సభ్యులకు ఉన్న అనేక సందేహాలు, ప్రశ్నలను కూడా గమనించింది. ఈ నేపథ్యంలో, తమ సభ్యులకు అవగాహన, సాధికారత, సమాచారమందించే కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉద్భవించింది. ఈ ప్రథమ యత్నం ద్వారా తమ సభ్యులను చేరుకోవడం, IPRS ప్రధాన లక్ష్యాలలో ఒకటిగా మారింది.

ఈ దిశలో ప్రయాణాన్ని ప్రారంభిస్తూ, IPRS తన సభ్యుల కోసం వరుస వర్క్‌షాప్‌లను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. IPRS సభ్యులకు పాన్-ఇండియా వర్క్‌షాప్‌లు కొత్త జ్ఞానోదయాన్ని చూపించేంత గొప్పగా ఉంటాయి, వారి సృజనాత్మక ప్రయాణానికి, వృత్తికి ప్రయోజనం చేకూరుస్తాయి. పేరుకు తగ్గట్టే ఈ “లెర్న్ అండ్ ఎర్న్” అనే నాలెడ్జ్ వర్క్‌షాప్ హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించబడింది.

“లెర్న్ అండ్ ఎర్న్” వర్క్‌షాప్ మొదటి గమ్యస్థానంగా చెన్నైలో ప్రారంభించాక 2022 మే 6న హైదరాబాద్‌కి వచ్చింది. ప్రముఖ సంగీత సృష్టికర్తలు, ముఖ్యంగా తెలుగు సంగీత పరిశ్రమ నుండి, అగ్రశ్రేణి స్వరకర్తలు, పాటల రచయితలు, ప్రచురణకర్తలు, ప్రముఖ IPRS సభ్యులందరూ ఈ సమావేశానికి విచ్చేశారు.

వర్క్‌షాప్‌లో చర్చా కేంద్ర బిందువు. సంగీతంలో కాపీరైట్, డిజిటల్ యుగంలో అభివృద్ధి చెందుతున్న ట్రెండ్‌లకు, సాంకేతిక పురోగతికి లైసెన్స్ ఇవ్వడం, క్రియేటర్ల హక్కులు, వారికి న్యాయంగా రావలసిన వాటిని రక్షించడంలో IPRS పాత్ర వంటి సంబంధిత రంగాలపై కేంద్రీకృతమై ఉంది.

ఈ ప్రారంభంపై, ప్రముఖ పాటల రచయిత, సంగీత స్వరకర్త, IPRS సభ్యులు అయిన ఎం.ఎం. కీరవాణి వ్యాఖ్యానిస్తూ, “జ్ఞానం, సమాచారంతో సంగీత సృష్టికర్తలందరికీ సాధికారత కల్పించడానికి, IPRS ‘లెర్న్ అండ్ ఎర్న్’ అనే ప్రథమ యత్నం చేయడం ఒక అద్భుతమైన చర్య. సంగీత నిర్మాతలందరూ తమ ప్రాథమిక హక్కులను తెలుసుకోవడం చాలా ముఖ్యం. అజ్ఞానం తరచుగా వారికి రావలసిన క్రెడిట్‌లను, తమకు న్యాయంగా రావలసిన వాటిని కోల్పోయేలా చేస్తుంది. వేగవంతమైన పరివర్తన, పెరుగుతున్న అవకాశాల నేపథ్యంలో ఒక స్వరకర్త లేదా రచయిత ఒక క్రియేటరుగా అభివృద్ధి చెందడానికి, సంగీత వ్యాపారం విభిన్న అంశాల గురించి సమానంగా తెలుసుకోవాలి. కాపీరైట్ సొసైటీగా IPRS తమ సభ్యులకు సాధారణ రాయల్టీలతో మద్దతు ఇస్తోంది, ఇప్పుడు విద్య, నైపుణ్యం పెంచడానికి ఈ చొరవ తీసుకోబడినందుకు నేను సంతోషిస్తున్నాను” అని అన్నారు.

ప్రచారాన్ని ప్రశంసిస్తూ, ప్రఖ్యాత పాటల రచయిత శ్రీ మయూర్ పూరి మాట్లాడుతూ, “సంగీత సృష్టికర్త సంఘం యొక్క ఏకైక అతిపెద్ద, అతి ముఖ్యమైన స్వరం ఈ IPRS. నేడు, సంగీత పరిశ్రమ ప్రతిరోజూ మరింత వికేంద్రీకరించబడు తోంది, మా దూరదృష్టి గల చైర్‌పర్సన్ శ్రీ జావేద్ అక్తర్ సాబ్ ఆదేశానుసారం, IPRSలో మనమందరం మన వైవిధ్యభరితమైన, సమష్ఠి కార్యక్రమాలను వేగవంతం చేయడం అత్యవసరం. ‘లెర్న్ అండ్ ఎర్న్’ అనేది పూర్తి-రోజు, బహుళ నగరాల వర్క్‌షాప్‌ల శ్రేణి, మా సభ్యులను ఈ క్రియేటర్ ఎకనమీలో మనుగడ సాగించేలా చేయడమే కాకుండా అభివృద్ధి చెందడానికి, శక్తిమంతం చేయడానికి రూపొందించబడింది. కమ్యూనిటీని ఏకతాటిపైకి తీసుకురావడానికి ఇంత సమగ్రమైన కంటెంట్‌ని ప్లాన్ చేయడం ఇదే మొదటిసారి, దీని నుండి వేలాది మంది సంగీత నిర్మాతలు ప్రయోజనం పొందాలని మేము ఆశిస్తున్నాము” అని అన్నారు.

విలేకరుల సమావేశంలో IPRS CEO శ్రీ రాకేష్ నిగమ్ మాట్లాడుతూ, “భారత సంగీత పరిశ్రమ డైనమిక్‌గా అభివృద్ధి చెందుతోంది, భౌగోళిక పరంగా అత్యంత ప్రసిద్ధి చెందిన పాటల రచయితలు, స్వరకర్తలకు హోమ్ గ్రౌండ్‌గా ఉంది. తెలుగు సంగీత పరిశ్రమ జనాదరణలో భౌగోళికాలను అధిగమించే పాటలతో పెద్ద ప్రభావాన్ని సృష్టిస్తోంది, ఇతరులు అనుసరించడానికి ఒక ప్రమాణాన్ని సెట్ చేస్తోంది. పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నప్పుడు, పాటల రచయితలు, స్వరకర్తలు తమ హక్కుల గురించి బాగా తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ చొరవతో, సంగీతం కాపీరైట్ మరియు లైసెన్సింగ్ గురించి అవగాహన కల్పించడంతోపాటు మా సభ్యులకు జ్ఞానం, పరిజ్ఞానం ద్వారా నైపుణ్యాన్ని పెంచుకోవడంలో సహాయపడటం మా లక్ష్యం. IPRS వద్ద, మా సభ్యులకు మరిన్ని అవకాశాలను సృష్టించడం, మా సభ్యులకు భారతీయ సంగీత పరిశ్రమకు సహాయపడే బలమైన పర్యావరణ వ్యవస్థ వైపు మార్గం సుగమం చేయడంపై మా ప్రాథమిక దృష్టి ఉంటుంది” అని అన్నారు.

Mr. నిగమ్ ఇంకా మాట్లాడుతూ, “20-21 ఆర్థిక సంవత్సరంలో రూ.169.8 కోట్ల నుంచి 21-22 ఆర్థిక సంవత్సరంలో రూ.310+ కోట్ల వరకు. దాదాపు 85% వృద్ధిని నమోదు చేయడం ద్వారా IPRS చరిత్రలో 21-22 ఆర్థిక సంవత్సరం తన ఆదాయాలతో కొత్త కళను సంతరించుకుంది. 21-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయంలో స్ట్రీమింగ్/OTT ప్లాట్‌ఫామ్‌లు ప్రధాన పాత్ర పోషించాయి.

రాయల్టీ చెల్లింపులు రూ.200 కోట్ల మార్కును అధిగమించిన సంవత్సరం కూడా ఇదే, గత సంవత్సరం రూ.183.3 కోట్లతో పోలిస్తే ఈసారి 210 కోట్లను సాధించింది. IPRS తన సభ్యులకు సహాయ నిధులను కూడా అందించింది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆదాయ నష్టం ప్రభావాన్ని తగ్గించడానికి FY21-22 సమయంలో దాదాపు 3900 మంది రచయిత సభ్యులకు రూ.6.2 కోట్ల ఆర్థిక సహాయం అందించబడింది.

error: Content is protected !!