365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,సెప్టెంబర్ 3, హైదరాబాద్:టీఎస్ఆర్టీసీ ఎండీగా రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నుఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సజ్జనార్ కు పుష్పగుచ్ఛం అందజేసి మంత్రి పువ్వాడ అభినంధనలు తెలిపారు. ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వర్తించిన సునీల్ శర్మ పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పి సత్కరించారు. అనంతరం రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.