365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 8,2024:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి ఉంది.. ఎన్డీయే అభ్యర్థులను గెలిపించండి అని ఒక్క మాట అన్నందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏకంగా వంద బాణాలు సంధించారు.. బిజెపి,టీడీపీనేతల వద్ద సమాధానాలు లేవు.. జగన్ సంధించిన ప్రశ్నలకు తల దించుకోవడం తప్ప మరొక మార్గం లేదు.

2014 -19 మధ్య బీజేపీతో పొత్తులో ఉన్న చంద్రబాబు ఆ తరువాత కూటమి నుంచి వైదొలగిన తరువాత చంద్రబాబు మోసగాడని మోడీ ఆరోపించారు..పోలవరాన్ని మంటగలిపారని.. అభివృద్ధి లేనేలేదని… కొడుకుకోసమే తప్ప ప్రజలకోసం చంద్రబాబు రాజకీయం చేయడం లేదని మోడీ దుమ్ముదులిపారు..

మరి అదే చంద్రబాబు ఇప్పుడు నీతిమంతుడు అయ్యారా ? వీరుడు సూరుడు అయ్యారా ? మరి ఏమి మార్పు గుర్తించి ఆయన్ను మళ్ళీ నెత్తికి ఎత్తుకుని మోస్తున్నారు అని జగన్ ప్రశ్నలు సంధించారు.

మోడీ సారధ్యంలోని ఎన్డీఎ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే అలాంటి పార్టీతో చంద్రబాబు పొత్తుపెట్టుకున్నారు… వీళ్ళిద్దరూ మన రాష్ట్ర ఆస్తిని అమ్మేస్తుంటే మేం చూస్తూ ఊరుకుంటామా…

ప్రజలు కానీ ఎన్డీయేకు ఓటేస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఒప్పుకున్నట్లే.. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగింది..లేకుంటే ఈపాటికి అదెప్పుడో జీర్ణం అయ్యేది అని జగన్ చేసిన ప్రసంగం ప్రజలను ఆకట్టుకుంది ఆలోచింపజేసింది..

మోసగాడు బాబును ఎందుకు గెలిపించాలి..? ఆయన్ను మీరెందుకు మోస్తున్నారు. వత్తాసుపలుకుతున్నారు అంటూ మోడీని జగన్ ప్రశ్నించి ఎదురుదాడి చేశారు.

Also read : Party this Weekend with King and DJ Chetas on a cruise! 

ఇది కూడా చదవండి: టీచర్స్ కి క్వెస్ట్ ట్రైనింగ్..లయన్ డా.హిప్నో పద్మా కమలాకర్

ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న జియో

Also read : YES BANK and EBANX Announce Strategic Partnership to Empower Cross-Border Commerce in India