Sun. Dec 22nd, 2024
IT-raids

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి 31, 2023: హైదరాబాద్‌ లో ఐటీ సోదాలు దడ పుట్టిస్తున్నాయి. మరోసారి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్‌తో పాటు పలు చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తంగా 40 చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తోంది.

వసుద ఫార్మా చైర్మన్ రాజుతో పాటు డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగు తున్నాయి. వసుద ఫార్మాతో పాటు రాజు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సైతం నిర్వహిస్తున్నారు.15 కంపెనీల పేరుతో రాజు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది..

కొద్ది రోజుల క్రితం కూడా హైదరాబాద్‌లో ఐటీ సోదాలు నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల్లో 50కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో 35 టీమ్‌లుగా విడిపోయి ఐటీ సోదాలు నిర్వహించింది. రియల్ ఎస్టేట్ , సినిమా ఫైనాన్సియర్స్ ఇళ్లపై దాడులు నిర్వహించింది.

IT-raids

బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో ఉన్న ఆదిత్య కన్‌స్ట్రక్షన్‌కు చేరుకుని సోదాలు చేస్తున్నాయి. బిల్డర్ మాధవరెడ్డి, అతని కార్యాలయంతోపాటు ఇల్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలపై సోదాలు సాగించింది.

అలాగే ఊర్జిత ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, వీర ప్రకాష్ నివాసాలు, వారి కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించింది. ప్రముఖ బిల్డర్‌కు మాధవరెడ్డి బినామీగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

కూకట్‌పల్లిలోని లోధా అపార్ట్‌మెంట్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్, పంజాగుట్టలో ఐటీ సోదాలు జరిగాయి. సీఆర్‌పీఎఫ్ బలగాల మధ్య ఏక కాలంలో తెలుగు రాష్ట్రాల్లో సోదాలను నిర్వహించడం జరిగింది.

ఇటీవల కాలంలో ఓ పార్టీలో చేరిన ప్రముఖ రాజకీయ నేత నివాసం, కార్యాలయంలో సైతం సోదాలు జరిగాయి. ఈ క్రమంలోనే తిరిగి ఈరోజు తెల్లవారు జామునే ఐటీ సోదాలకు దిగింది.

error: Content is protected !!