365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్14, 2022: ఆర్ఎస్ బ్రదర్స్ కు సంబంధించిన ఆఫీసులతోపాటు వారి ఇళ్లలో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టిన ఆర్ ఎస్ బ్రదర్స్.
ఆర్ఎస్ బ్రదర్స్ హానర్స్ రియల్ ఇన్ఫ్రా పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్ నిర్వహిస్తోంది. వాసవి తోపాటు పలు ప్రాజెక్టులు సైతం హానర్స్ సంస్థ చేపట్టింది.
కూకట్పల్లిలోని గల్ఫ్ ఆయిల్ ల్యాండ్ వివాదాల్లో కూడా జోక్యం చేసుకున్నట్లు హానర్స్ సంస్థ పై ఆరోపణలొస్తున్నాయి. వాసవి సుమధురతో కలిసి బిజినెస్ చేస్తున్న ఆర్ ఎస్ బ్రదర్స్. హానర్స్, సుమధుర,వాసవి,పరంపర ఆర్ఎస్ బ్రదర్స్ పై సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు.