Fri. Nov 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 20,2023: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఊగిసలాడాయి. లాభాల్లోంచి నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ రంగం నుంచి మద్దతు లభించింది.

ఆటో సహా మిగతా రంగాల సూచీలు పతనమయ్యాయి. బెంచ్ మార్క్ బీఎస్ఈ సెన్సె్క్స్ 140, నిఫ్టీ 38 పాయింట్ల మేర కుంగాయి. నిఫ్టీ 19,800 మీద నిలదొక్కుకుంటేనే మరింత బుల్లిష్‌నెస్ వస్తుంది.

ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. 33 ఏళ్ల గరిష్ఠాన్ని తాకడంతో జపాన్ సూచీ పతనమైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు బలహీనపడి 83.27 వద్ద స్థిరపడింది.

క్రితం సెషన్లో 65,794 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 65,787 వద్ద మొదలైంది. మరికాసేపటికే 65,844 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆపై క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. 65,547 వద్ద ఇంట్రాడే కనిష్ఠ స్థాయికి చేరుకుంది.

మొత్తంగా 139 పాయింట్ల నష్టంతో 65,655 వద్ద ముగిసింది. సోమవారం 19,731 వద్ద ఆరంభమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,756 వద్ద గరిష్ఠాన్ని తాకింది.

19,670 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసిన సూచీ చివరికి 37 పాయింట్లు పతనమై 19,694 వద్ద క్లోజైంది. బ్యాంకు నిఫ్టీ కేవలం ఒక పాయింటు లాభంతో 43,584 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 50లో 21 కంపెనీలు లాభపడగా 27 కంపెనీలు నష్టపోయాయి. రెండింట్లో మార్పేమీ లేదు. దివిస్ ల్యాబ్, భారతీ ఎయిర్‌టెల్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, కోల్ ఇండియా టాప్ గెయినర్స్.

అదానీ ఎంటర్‌ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, ఎస్బీఐ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్ టాప్ లాసర్స్. రంగాల వారీగా పరిశీలిస్తే ఐటీ సూచీ 0.60 శాతం ఎగిసింది.

బ్యాంకు, ఎఫ్ఎంసీజీ, మీడియా, మెటల్, రియాల్టీ సూచీలు ఎక్కువ నష్టపోయాయి.

నిఫ్టీ నవంబర్ ఫ్యూచర్స్ ఛార్ట్‌ గమనిస్తే 19,850 వద్ద రెసిస్టెన్సీ, 19,700 వద్ద సపోర్టు ఉన్నాయి. ఇన్వెస్టర్లు స్వల్ప కాలానికి విప్రో, ఒలెక్ట్రా, హీరోమోటో, సైయెంట్ షేర్లను కొనొచ్చు.

నేటి నిఫ్టీ పతనంలో బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, ఎల్టీ కాంట్రిబ్యూషన్ ఎక్కువ. సూచీ ఎక్కువ పతనమవ్వకుండా ఎయిర్‌టెల్, టీసీఎస్ కాపాడాయి.

ఒకానొక దశలో 3.8 శాతం పెరిగిన డిష్ టీవీ తర్వాత 2.8 శాతం నష్టాల్లోకి జారుకుంది. ఇర్కాన్ ఇంటర్నేషనల్ సైతం ఇదే దారిలో నడిచింది. తుషార్ పఠాంకర్‌ను యెస్ బ్యాంకు చీఫ్ రిస్క్ ఆఫీసర్‌గా నియమించింది.

అపోలో హాస్పిటల్స్, అరబిందో, బజాజ్ ఆటో, డీఎల్ఎఫ్, ఐచర్ మోటార్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, కేపీఐటీ టెక్నాలజీస్, వరుణ్ బేవరేజెస్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు ఇంట్రాడేలో 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి.

నైకాలో 10.2 లక్షల షేర్లు చేతులు మారాయి. దిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రవేశించడంతో ఒబెరాయ్ రియాల్టీ షేర్లు రికార్డు స్థాయిలో ముగిశాయి.

రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ షేర్లు 8 శాతం నష్టపోయి ఎనిమిదేళ్ల కనిష్ఠానికి చేరుకున్నాయి. మథర్సన్ సుమిలో 15.2 లక్షల షేర్లు చేతులు మారాయి.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709
error: Content is protected !!