365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ, అక్టోబర్ 15, 2025: ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ (ఐటీసీహెచ్ఎల్) తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విస్తరణలో భాగంగా, ‘వెల్కమ్‌హోటల్ బై ఐటీసీ హోటల్స్’ బ్రాండ్ కింద హైదరాబాద్ ,నెల్లూరులలో రెండు కొత్త హోటళ్ల నిర్వహణ కోసం డీఎస్ఆర్ హాస్పిటాలిటీ సర్వీసెస్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఐటీసీహెచ్ఎల్ ప్రకటించింది.
‘వెల్కమ్‌హోటల్’ బ్రాండ్ హోటల్ డెవలపర్‌లతో భాగస్వామ్యం ద్వారా భారత దేశ వ్యాప్తంగా తన ఉనికిని బలోపేతం చేస్తోంది. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో నిర్మించబడే వెల్కమ్‌హోటల్‌లో 117 గదులు, 800 చదరపు మీటర్లకు పైగా సమావేశ స్థలం అందుబాటులో ఉంటాయి. నెల్లూరులోని వెల్కమ్‌హోటల్‌లో 127 గదులు, 2600 చదరపు మీటర్లకు పైగా సమావేశ స్థలం ఉంటాయి.
ఈ సందర్భంగా ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ చద్దా మాట్లాడుతూ, “హైదరాబాద్,నెల్లూరులలో వెల్కమ్‌హోటల్ కోసం డీఎస్ఆర్ హాస్పిటాలిటీ సర్వీసెస్‌తో భాగస్వామ్యం చేసుకోవడం మాకు సంతోషాన్నిస్తోంది.

కొత్త నగరాల్లోకి విస్తరించాలనే మా వ్యూహాత్మక వృద్ధి ప్రణాళికలకు ఈ ఒప్పందం ఒక స్పష్టమైన నిదర్శనం. దీని ద్వారా భారతదేశవ్యాప్తంగా ఐటీసీహెచ్ఎల్ ఉనికిని మరింత బలోపేతం చేస్తున్నాము,” అని తెలిపారు.
డీఎస్ఆర్ హాస్పిటాలిటీ సర్వీసెస్ మేనేజింగ్ పార్టనర్ డి. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, “హైదరాబాద్, నెల్లూరులలో మా రాబోయే ప్రాపర్టీలను ‘వెల్కమ్‌హోటల్ బై ఐటీసీ హోటల్స్’ బ్రాండ్ కింద అభివృద్ధి చేయడానికి ఐటీసీ హోటల్స్‌తో భాగస్వామ్యం చేసుకోవడం మాకు ఎంతో ఆనందాన్నిస్తోంది,” అని పేర్కొన్నారు.
డీఎస్ఆర్ హాస్పిటాలిటీ సర్వీసెస్ భాగస్వాములైన డి. ప్రభాకర్ రెడ్డి,డి. రఘురామి రెడ్డి మాట్లాడుతూ,“ఈ రెండు ప్రాజెక్టులు డీఎస్ఆర్ హాస్పిటాలిటీకి అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. ఐటీసీ హోటల్స్ విశిష్టమైన ఆతిథ్యం,ప్రసిద్ధ ఫుడ్ & బెవరేజ్ అనుభవాలను ఈ కీలక మార్కెట్లకు తీసుకురావడానికి వారితో కలిసి పనిచేయడానికి మేము ఎదురుచూస్తున్నాము.

హైదరాబాద్,నెల్లూరులతో మాకు బలమైన సాంస్కృతిక ,వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ప్రపంచ-స్థాయి నిర్మాణాలతో ఈ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడటానికి మేము కట్టుబడి ఉన్నాము.
గొప్ప వారసత్వం,నిరూపితమైన నైపుణ్యం కలిగిన ఐటీసీ హోటల్స్, ఈ రెండు నగరాలకు వ్యక్తిగతమైన, అత్యుత్తమ సేవలను అందించగలదని మేము గట్టిగా నమ్ముతున్నాము,” అని వ్యాఖ్యానించారు.