Wed. Jan 15th, 2025
It’s time to celebrate… with purity & quality
It’s time to celebrate… with purity & quality

It’s time to celebrate… with purity & quality

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్,సెప్టెంబర్ 30,2021 : పండుగ ఏదైనా పిండివంటలు ఉండాల్సిందే ! తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణా గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది ? తెలంగాణాలో బతుకమ్మ, దసరా వేడుకలు కలిసి రావడంతో పది రోజుల పాటు ప్రతి ఇంటా సందడి కనిపిస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా పిండివంటలు కనిపించని ఇల్లే ఉండదు. బూరెలు, కజ్జికాయలు, మురుకులు… చెబితే జాబితా చాలా పెద్దగానే ఉంటుంది. అమ్మమ్మల కాలం నాటి వంటకాలకు సరికొత్త రుచులను జోడించి ప్రయోగాలు చేసే ఔత్సాహిక పాకశాస్త్ర నిపుణులూ కనిపిస్తున్నారిప్పుడు.

సామాజిక మాధ్యమాల ద్వారా యూట్యూబ్‌ చెఫ్‌లు ఎలా వండాలో చెబుతుంటే, ఆ ప్రయత్నంలో ఉన్న ఇల్లాలికి సహాయపడుతూ బంధాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకువెళ్తున్న మగమహారాజులూ ఉన్నారు. ఈ పండుగ సీజన్‌లోని మధురస్మృతులను కలకాలం పదిలంగా పరుచుకోవడానికీ తమ వంతు ప్రయత్నాలూ చేస్తున్నారు. కానీ ఆ రుచి చెడకుండా ఉండాలంటే పిండివంటలలో ఉపయోగించే నూనె కూడా అంతే చక్కనిదై ఉండాలి. స్వచ్ఛమైన నూనె కావడంతో పాటుగా ప్రపంచ శ్రేణి నాణ్యత కలిగిన గోల్డ్‌ డ్రాప్‌ సన్‌ఫ్లవర్‌ లాంటి నూనెలు కుటుంబ ఆరోగ్యానికీ భరోసానందిస్తాయి.

It’s time to celebrate… with purity & quality
It’s time to celebrate… with purity & quality

గోల్డ్‌ డ్రాప్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌, ప్రపంచ శ్రేణి ప్రీమియం సూపర్‌ రిఫైన్డ్‌ ఆయిల్‌. అత్యున్నత స్వచ్ఛతకు ప్రతిరూపంగా నిలిచే గోల్డ్‌ డ్రాప్‌ నూనెతో తయారుచేసిన పిండివంటలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. గోల్డ్‌డ్రాప్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ మితేష్‌ లోహియా.. మాట్లాడుతూ ‘‘ప్రతి చుక్కలోనూ నాణ్యతను అందిస్తుంది. మా ప్యాక్‌లు కల్తీ జరగడానికి అవకాశం ఉండదు, అలాగే మ్మా ఆయిల్ తో చేసిన వంటకాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి’’ అని అన్నారు.

error: Content is protected !!