Mon. Dec 23rd, 2024
Peep-Show-Movie-Teaser-laun
Peep-Show-Movie-Teaser-laun

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,జూలై 14,2022: సుప్రీమ్ డ్రీమ్స్ పతాకంపై టి.వి.ఎన్.రాజేష్ సమర్పణ.యువ ప్రతి భాశాలి క్రాంతికుమార్ సి.హెచ్ దర్శకత్వంలో అమి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న వినూత్న కథాచిత్రం “పీప్ షో”. దొంగచాటుగా తొంగిచూడడాన్ని “పీప్ షో” అంటారన్న విషయం తెలిసిందే. జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్ మొదటిసారి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నేహాదేశ్ పాండే హీరోయిన్. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ క్రేజీ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు.

Peep-Show-Movie-Teaser-laun
Peep-Show-Movie

జబర్దస్త్ సూపర్ స్టార్స్ లో ఒకడైన ఆటో రామ్ ప్రసాద్ తొలిసారి హీరోగా నటిస్తున్న “పీప్ షో” చిత్రానికి మలయాళ సంగీత సంచలనం రంజిన్ రాజ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే నమ్మకముందని చిత్ర దర్శకుడు క్రాంతి కుమార్, నిర్మాతలు టి.వి.ఎన్.రాజేష్, ఎస్.ఆర్. కుమార్ తెలిపారు. తన చిరకాల మిత్రుడు క్రాంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పీప్ షో” చిత్రంతో తెలుగులో పరిచయం అవుతుండటం చాలా సంతోషంగా ఉందన్నారు సంగీత దర్శకుడు రంజిన్ రాజ్. “పీప్ షో” చిత్రం దర్శకుడిగా తన మిత్రుడు క్రాంతి దర్శకత్వ ప్రతిభకు అద్దం పడుతుందని హీరో రామ్ ప్రసాద్ పేర్కొన్నారు.

Peep-Show-Movie
Peep-Show-Movie-Teaser-laun

శ్రీరాగ్, సంధ్య ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, అసిస్టెంట్ డైరెక్టర్స్: ఆనంద్ రెడ్డి-నాని, కో-డైరెక్టర్: ఆర్.కె.రాజు, డి.ఐ.కలరిస్ట్: పి.వి.బి.భూషణ్, కన్ఫర్మిస్ట్: ఏడిద శ్రీనివాసరావు, టెక్నికల్ హెడ్: కె.వి.చరణ్ కుమార్, ప్రొడక్షన్ మేనేజర్: నవీన్ ప్రకాష్, సినిమాటోగ్రఫీ: ఈశ్వర్, ఎడిటింగ్: సునీల్ మహారాణ, స్క్రిప్ట్ అసోసియేట్: లుధీర్ బైరెడ్డి, లైన్ ప్రొడ్యూసర్స్: శ్యామ్ సుందర్.జి – నూల శివప్రసాద్ – గాదరి దేవా, ఎగ్జికూటివ్ ప్రొడ్యూసర్: సురేష్ కాకుమాని, సంగీతం: రంజిన్ రాజ్, సమర్పణ: టి.వి.ఎన్. రాజేష్, సహ నిర్మాత: ఎస్.ఆర్.కుమార్, నిర్మాణం: అమి ఎంటర్టైన్మెంట్స్, రచన-దర్శకత్వం: క్రాంతికుమార్.సి.హెచ్.

error: Content is protected !!