Mon. Dec 23rd, 2024
Jaisvi-won-Silver-Medal

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 25, 2022: హైదరాబాద్ కు చెందిన ఆరేళ్ళ జైస్వీ అరుదైన ఘనత సాధించింది. రష్యాలోని మాస్కోలో నిర్వహించిన అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ పోటీల్లో ఇండియా, తెలంగాణ నుంచి పోటీ చేసిన ఆరేండ్ల హైదరాబాద్ అమ్మాయి జైస్వీ సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది. ఆమెతోపాటు కోచ్ అలికా ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు.

Jaisvi-won_-Silver-Medal

ఈసందర్భంగా వారికి జైస్వీ తల్లిదండ్రులు ఎయిర్ పోర్ట్ లో ఘనంగా స్వాగతం పలికారు. ఆయా దేశాల నుంచి 18 టీముల్లో 250 మంది జిమ్నాస్టులు అండర్ 7లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో జైస్వీ అద్భుతమైన ప్రదర్శనతో సిల్వర్ మెడల్ సాధించింది. మణికొండకు చెందిన జైస్వీ 1వ తరగతి చదువుతోంది. మూడేళ్ల వయసులోనే జిమ్నాస్టిక్స్ లో చేరి, మణికొండలోని జోయ్ జిమ్నాస్టిక్స్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. మూడు సంవత్సరాల నుంచి శిక్షణ పొందుతున్న జైస్వీ జిల్లా స్థాయి పోటీల్లోనూ పలు మెడల్స్ సాధించినట్టు కోచ్ అలికా పేర్కొన్నారు.

error: Content is protected !!