నూతన సంవత్సరం సందర్భంగా పోటెత్తిన భక్తులు..
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, ఖమ్మం, జనవరి1,2022 : నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన జమలాపురం వెంకటేశ్వర స్వామివారి ఆలయ ఆదాయం పెద్దమొత్తంలో వచ్చింది. పలు ఆర్జిత ,మొక్కుల ద్వారా వచ్చిన ఆదాయం ఆరులక్షల 80వేలు వచ్చినట్లు ఆలయ ఈవో కొత్తూరు జగన్మోహన్ రావు తెలిపారు. శనివారంతోపాటు, కొత్త సంవత్సరం ఒకే రోజూ రావడంతో దాదాపు 45వేల మంది భక్తులు స్వామివారిని దర్శించినట్లు ఆయన పేర్కొన్నారు.
జమలాపురానికిచెందిన ప్రముఖ వ్యాపార వేత్త తుళ్లూరు కోటేశ్వరావు భక్తులకు ప్రసాదాన్ని ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా ఎర్రుపాలెం సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మేడ ప్రసాద్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు.