365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే15, 2025: వీఆర్‌పీ క్రియేషన్స్ పతాకంపై, పి. పద్మావతి సమర్పణలో రూపొందిన సమాజోద్ధారక చిత్రం “జనం” మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ 10, 2024న మొదట విడుదలైన ఈ చిత్రం, రాజకీయ వ్యవస్థలో జరుగుతున్న మాయాచర్యలను ఎండగడుతూ ప్రేక్షకులలో చైతన్యం రేపింది. ఇప్పుడు మే 29, 2025న “జనం” థియేటర్లలో రీ-రిలోకి వస్తోంది.
Read This also…Janam Movie Set for Re-Release on May 29..
Read This also…Pallavi Model School, Bowenpally Celebrates Outstanding Success in Grade X & XII Board Examinations (2024–25)
వెంకటరమణ పసుపులేటి రచన, దర్శకత్వం, నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో సుమన్, అజయ్ ఘోష్, కిషోర్, వెంకటరమణ, ప్రగ్యా నైనా ప్రధాన పాత్రల్లో నటించారు. రాజకీయ నాయకుల మాటలకు బానిసలవుతున్న నేటి యువతను ఉద్దేశించి రూపొందిన ఈ చిత్రం, బహుళ అంశాలను స్పృశిస్తూ మౌలిక విలువలను గుర్తుచేస్తుంది.

ఈ సందర్భంగా దర్శకుడు వెంకటరమణ పసుపులేటి మాట్లాడుతూ –
“నేటి తరానికి అవగాహన కల్పించే చిత్రంగా ‘జనం’ను తీశాం. ఓటు కోసం డబ్బు, మద్యం, వాగ్దానాలతో ప్రజలను మభ్యపెడుతున్న రాజకీయ వ్యవస్థపై తీవ్ర విమర్శ చేస్తూ, పౌరులు ఎలా తప్పుడు మార్గాలకు దారి పడుతున్నారో ఈ సినిమా చూపిస్తుంది.
ఇది కూడా చదవండి…OPPO F29 సిరీస్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి జోష్‌ఫుల్ స్పందన..
Read This also…OPPO F29 Series Sees 28% Sales Surge in Andhra Pradesh..
OTTలో విడుదల చేసే ఆలోచన లేదుగానీ, థియేటర్‌లో వీక్షించడం ద్వారా అసలైన అనుభూతి లభిస్తుంది. సుమన్ ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. కమెర్షియల్ అంశాలు, సందేశాత్మకత, సెంటిమెంట్, థ్రిల్ అన్నీ కలబోసిన చిత్రమిది. మే 29న థియేటర్లకు వెళ్లి తప్పక చూడండి” అన్నారు.