365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్,నవంబర్ 8,2022: ఇప్పటం గ్రామంలో ఇళ్ళు కోల్పోయిన ప్రతి కుటుంబానికి జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు.
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఇళ్ళు దెబ్బతినడంతో పార్టీ తరపున పవన్ కళ్యాణ్ వారికి లక్ష రూపాయలు ఇస్తారని చెప్పారు. కూల్చిన ఇళ్ళు నిర్మించుకోవడానికి వారు సహాయం అందిస్తున్నట్లు చెప్పారు.
ఇటీవల గ్రామాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి బాధితులను కలిసిన విషయం తెలిసిందే. కొంతమంది రైతులు బహిరంగ సభకు స్థలాన్ని ఇచ్చారు కాబట్టి గ్రామంలో ఇళ్ళను వైసీపీ కూల్చివేసిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వారికి మద్దతుగా నిలబడాలని నిర్ణయించుకు న్నట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పక్షపాత చర్యలు సరికాదు అని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.