365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, అమరావతి, నవంబర్5, 2022:రోడ్లపై గుంతలు పూడ్చలేనివాళ్ళు120అడుగుల రోడ్డు వేస్తారా..? అని జనసేన పార్టీ అధినేత ప్రశ్నించారు. ప్రజా సమస్యలు జగన్ రెడ్డికి పట్టవని, ఇప్పటం గ్రామస్తులు మార్చిలో జరిగిన జనసేన పార్టీ ప్లీనరీకి స్థలం ఇవ్వడంవల్లే వైసీపీ ఇక్కడి ప్రజల ఇళ్లను కూల్చేస్తుందని పవన్ అన్నారు.
మేముకూడా ఇడుపులపాయలో హైవే రోడ్ వేస్తామని హెచ్చరించారు. ఇప్పటం గ్రామంలో ఇళ్లు కోల్పోయిన బాధితులను పవన్ పరామర్శించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసిన పవన్ కళ్యాణ్ ఆయనకు నివాళులర్పించారు.
అంతకముందు ఇప్పటం వెళ్లకుండా జనసేన పార్టీ అధ్యక్షులు @PawanKalyanను మంగళగిరిలోని పార్టీ కార్యాలయం ముందే నిలువరించే ప్రయత్నం చేశారుపోలీసులు. దీంతో వాహనం దిగి నడుచుకుంటూ ఇప్పటం బయలుదేరారు. అరెస్టు చేసుకుంటే అరెస్టు చేసుకోనివ్వండి అని పోలీసులతో అన్నారు పవన్ కళ్యాణ్.
ఇప్పటంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు:
మార్చిలో మా సభకు భూమి ఇస్తే, ఏప్రిల్ లో ఇళ్లను కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారు
జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారనే కక్షతోనే ఇళ్లను కూల్చారు
ఎమ్మెల్యే ఆర్కే ఇళ్లు పెదకాకానిలో రహదారి విస్తరణ లేదా?
కనీసం మాట్లాడనీయకుండా ఆపడానికి మీరెవరు
కాకినాడ లేదా రాజమహేంద్రవరం రోడ్లు వెడల్పు చేయరా
వైసీపీ నాయకులారా ఖబర్దార్
ఇలాగే చేస్తే పులివెందులలో మీ మీద నుంచి హైవే వేస్తాం
గుంతలు పూడ్చలేరు ఇళ్లను కూల్చుతారు
పోలీసులు కూడా మన సోదరులే చేతులు కట్టుకొని నిరసనలు చేపట్టండి.