varahi-featues

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,డిసెంబర్ 7,2022: “వారాహి” ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రత్యేక లైటింగ్..ఆధునిక సౌండ్ సిస్టమ్స్ తోపాటు ప్రత్యేక భద్రత చర్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దారు. వారాహి వాహనంపై ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి.

వాహనం నుంచి పవన్ కళ్యాణ్ ప్రసంగించే సందర్భంలో లైటింగ్ పరమైన ఇబ్బందులు లేకుండా వాహనం చుట్టూ లైట్లు ఏర్పాట్లు చేశారు. ఆధునిక సౌండ్ సిస్టం వినియోగించారు. వేల మందికి స్పష్టంగా పవన్ కళ్యాణ్ ప్రసంగం వినిపించే విధంగా ఈ సౌండ్ సిస్టం ఉంటుంది.

varahi-featues

వారాహి.. వాహనానికి నలువైపులా సీసీ కెమెరాలు అమర్చారు. వాహనం నిలిపిన, సభ నిర్వహించే ప్రదేశంలో పరిస్థితి రికార్డయ్యే ఫుటేజ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వర్ కి రియల్ టైంలో వెళ్తుంది. 2008 నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పర్యటనల్లో ఎదురయిన అంశాలని దృష్టిలో ఉంచుకొని భద్రత చర్యలు తీసుకున్నారు.

వాహనం లోపల పవన్ కళ్యాణ్ తోపాటు మరో ఇద్దరు కూర్చొని చర్చించుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి. అక్కడి నుంచి హైడ్రాలిక్ విధానంలో మెట్లు ఉంటాయి. వాటి ద్వారా వాహనం మీదకు చేరుకోవచ్చు.

https://www.youtube.com/shorts/MhJua8tx_W0

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు..

varahi-featues

జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రంలోని శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో “వారాహి” వాహనానికి ప్రత్యేక పూజలు చేయించినతర్వాత..”వారాహి” వాహనంపై పర్యటన మొదలుపెట్టనున్నారు పవన్ కళ్యాణ్.

ఈ వార్తలు కూడా చదవండి..

పవన్ కళ్యాణ్ వాహనానికి “వారాహి”అని పేరు ఎందుకు పెట్టారో తెలుసా..?
యాప్ స్టోర్ విధానాలను అప్‌డేట్ చేయనున్న ఆపిల్
రాబోయే ఐదేళ్లలో ప్రపంచ పునరుత్పాదక శక్తి సామర్థ్యం రెట్టింపు
శ్రీకపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం
For Health | హల్దీ చాయ్ తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..
Do not eat this combination food..
Palak-paneer should not be eaten together..? Why..? What do nutritionists say?