365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, నవంబర్ 27,2022: ‘వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపిన వారికి మద్దతునిచ్చే వారినే రౌడీ సేన అనాలి.. సొంత ఊరిలో ముఠా సంస్కృతితో చెట్లు నరికే వారిని రౌడీ సేన అంటారు.
అంతేకాని అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు అండగా నిలబడిన వారిని, వందలాది మంది ప్రాణాలను విపత్తు సమయంలో కాపాడిన నిజమైన హీరో రామయ్య లాంటి వారిని సత్కరించుకున్న మమ్మల్ని ఏమంటారో ప్రజలకు తెలుసు’ అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు.
ఉమ్మడి కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన సమయంలో ఎంతో మందికి ఫోన్ చేసి అప్రమత్తపరచి ప్రాణాలు కాపాడిన అన్నమయ్య ప్రాజెక్టు లష్కర్ రామయ్య ని ఆదివారం పవన్ కళ్యాణ్ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో సత్కరించారు. ఆయనతో పాటు అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన సమయంలో సర్వం కోల్పోయిన నేషనల్ బాక్సర్ వంశీకృష్ణ అనే యువకుడికి సాయం అందించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “రాయలసీమలో ప్రజల్ని భయపెట్టకుండా నామినేషన్లు వేసి పోటీ చేసే ధైర్యం వైసీపీకి లేదు. ప్రతి ఒక్కరిని బెదిరించి ఎన్నికలను, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారు. నేలపైన ఆధారపడిన రైతు ఆర్థిక మూలాలు దెబ్బ తీసేయడానికి ముఠా సంస్కృతితో చెట్లు నరికిస్తారు.
మత్స్య పురాణంలో ఒక పంక్తి ఉంటుంది. పది బావులు ఒక చెరువుతో సమానం.. పది చెరువులు ఒక సరస్సుతో సమానం.. పది సరస్సులు ఒక బాలుడుతో సమానం.. పదిమంది బాలురు ఒక చెట్టుతో సమానం అంటారు”.
“చెట్టు గొప్ప విశిష్టత తెలుసుకోవాలంటే కచ్చితంగా ఈ వాక్యాలు గుర్తుంచుకోవాలి. ఒక చెట్టు నరికేస్తున్నారు అంటే పది మంది బిడ్డల్ని హత్య చేస్తున్నట్లే. ప్రజల్ని భయపెట్టేందుకు రైతుల తోటలను నరికే విష సంస్కృతి కలిగిన నాయకులున్నారు. రాయల సీమ అంటే అలాంటి నాయకులే కాదు ప్రజల పట్ల బాధ్యత ఉన్న లష్కర్ రామయ్య లాంటి వారూ ఉన్నారని” పవన్ కళ్యాణ్ అన్నారు.
నన్ను ఇబ్బంది పెట్టిన వారెవరినీ మర్చిపోను: పవన్ కళ్యాణ్
”AP04 రామాపురం” సినిమా ట్రైలర్ రిలీజ్
20 రకాల ఇన్ఫ్లుఎంజా వైరస్ నుంచి రక్షించే వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు..
భవిష్యత్తులో పాల ధరలను పెంచే ఆలోచన లేదన్న అమూల్
‘ త్వరలో మరో మహమ్మారి.. పరిస్థితులు చాలా ఘోరం ఉండవచ్చు’
ఎన్‌డీటీవీ స్వాధీనంపై గౌతమ్ అదానీ కీలక వ్యాఖ్యలు
చైనాలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు.. పలుచోట్ల లాక్ డౌన్..