Mon. Dec 23rd, 2024
Fashion-Tour

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,నవంబర్ 26, 2022: హైదరాబాద్ నగరంలో శుక్రవారం జరిగిన బ్లెండర్స్ ప్రైడ్ గ్లాస్‌వేర్ ఫ్యాషన్ టూర్ 2022 అదిరిపోయింది. ఈ ష్యాషన్ షో లో మోడల్స్ తమ వయ్యారి నడకతో ఆకట్టుకున్నారు. అమిత్ అగర్వాల్ ‘ప్రైడ్ ఇన్ సస్టైనబుల్ ఫ్యాషన్’ని ప్రదర్శించారు.

ఆర్కిటెక్చరల్ డిజైనర్ నూరు కరీమ్ రూపొందించిన డిజైన్స్ అద్భుతంగా ఆకర్షించాయి. ఈ షో లో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ర్యాంప్‌పై వాక్ చేసి అందరినీ అలరించారు.

Fashion-Tour

16వ ఎడిషన్ బ్లెండర్స్ ప్రైడ్ గ్లాస్‌వేర్ ఫ్యాషన్ టూర్, ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్‌లో జరిగింది ఈ ఫ్యాషన్ షో. సెలబ్రిటీ డిజైనర్ అమిత్ అగర్వాల్, భారతదేశం లోని అత్యంత ప్రభావవంతమైన ఆర్కిటెక్ట్‌లలో ఒకరైన నూరు కరీమ్‌తో కలిసి ‘ప్రైడ్ ఇన్ సస్టైనబుల్ ఫ్యాషన్’ కోసం స్పెషల్ కలెక్షన్ ను రూపొందించారు. ఈ షోలో యూత్ ఐకాన్ జాన్వీ కపూర్ షోస్టాపర్‌గా నిలిచారు.

error: Content is protected !!