Sun. Dec 15th, 2024
Jawa 2.1 arrives in style

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా, ఫిబ్రవరి12, 2021 ః  జావా 2.1 రాకను వెల్లడిస్తూ జావా ఫార్టీ టు కుటుంబం ఇప్పుడు మూడు నూతన ఆకర్షణలను జోడించుకుంది. దేశంలో తమ తమ మోడల్‌  శ్రేణికి తాజా జోడింపులను క్లాసిక్‌ లెజండ్స్‌  ప్రకటించింది. ఇవి దేశవ్యాప్తంగా తమ డీలర్‌షిప్‌ల వద్ద లభ్యం కానున్నాయి.జావా 42 తనతో పాటుగా రెట్రో కూల్‌ విప్లవాన్ని ముందుకు తీసుకువస్తుంది. 2018లో ఇది ఆరంభమైనప్పటికీ ఇప్పుడు దానికి క్లాసిక్‌ టచ్‌ను జోడించుకుంది. ఈ మోటార్‌ సైకిల్‌ ధర1,83,942 రూపాయలు (ఎక్స్‌షోరూమ్‌, ఢిల్లీ)ఈ నూతన మోడల్స్‌ను పరిచయం చేస్తూ అశీష్‌ సింగ్‌ జోషి, సీఈవో– క్లాసిక్‌ లెజండ్స్‌ మాట్లాడుతూ ‘గత సంవత్సరం మేము బీఎస్‌ 6 వెర్షన్స్‌తో వచ్చాము.అక్కడితో మేము ఆగిపోలేదు.మమ్మల్ని మేము మరింతగా మెరుగుపరుచుకుంటూ అత్యుత్తమ పనితీరు , అనుభూతులను మా మోటార్‌సైకిల్స్‌ద్వారా అందిస్తున్నాం. దీనినే మేము 2.1గా పిలుస్తున్నాము. మేము ఈ వాహన ఎగ్జాస్ట్‌ నోట్‌ను బిగ్గరగా చేయడంతో పాటుగా మరింత ఆకట్టుకునే రీతిలో మలిచాము. అలాగే సీటు మెరుగుపరచడంతో పాటుగా అదనపు పంచ్‌ కోసం  క్రాస్‌ పోర్ట్‌ ఇంజిన్‌ను ఫైన్‌ ట్యూన్‌ చేశాము.

Jawa 2.1 arrives in style
Jawa 2.1 arrives in style

మా వినియోగదారులు ఎప్పుడూ కూడా 42ను తమ సృజనాత్మకతను వెల్లడిచేసే కాన్వాస్‌గా మార్చుకుంటుంటారు. దానిని స్ఫూర్తిగా తీసుకుని మేము మూడు నూతన రంగులను క్లాసిక్‌ సై్ట్రప్స్‌, అల్లాయ్‌ వీల్స్‌, ట్యూబ్‌లెస్‌ టైర్లు మరియు ట్రిప్‌ మీటర్‌ ప్రామాణికంగా అందిస్తూనే, ఫ్లై స్ర్కీన్‌, హెడ్‌ల్యాంప్‌ గ్రిల్‌ వంటి యాక్ససరీలనూ అందిస్తున్నాము. ఈ సాంకేతిక ఆధునీకరణలు జావా,ఫార్టీ టు శ్రేణి వ్యాప్తంగా లభ్యమవుతాయి,వినియోగదారులకు నూతన యాక్ససరీలను సైతం ఎంచుకునే అవకాశం లభిస్తుంది.. ’’ అని అన్నారు.

error: Content is protected !!