Sun. Dec 3rd, 2023
Jawahar-Reddy

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, నవంబర్ 30, 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డా.కెఎస్.జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

ఇప్పటి వరకూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన డా.సమీర్ శర్మ పదవీ కాలం నవంబరు 30వ తేదీతో పూర్తి కావడంతో ఆయన స్థానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డా.జవహర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 2574 ద్వారా మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

ఆ ఆదేశాలకు అనుగుణంగా బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సిఎస్ చాంబరులో సిఎస్ డా.సమీర్ శర్మ నుంచి డా.కెఎస్.జవహర్ రెడ్డి సిఎస్ గా బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా డా.కెఎస్.జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు సిఎస్ గా పనిచేసే అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.

సిఎస్ గా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలను గ్రామ స్థాయి వరకూ తీసుకువెళ్ళి చివరి వ్యక్తి వరకూ అందేలా అధికార యంత్రాంగాన్ని అన్ని విధాలా ముందుకు నడిపిస్తానని డా.జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.

Jawahar-Reddy

అంతే గాక ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలను మరింత పటిష్ట వంతంగా అమలయ్యేలా అన్ని విధాలా కృషి చేస్తానని సిఎస్.డా.జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. అంతకు ముందు విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇఓ ఆధ్వర్యంలో పలువురు వేదపండితుల ఆశీర్వచనాల మధ్య డా.జవహర్ రెడ్డి సిఎస్ గా బాధ్యతలు చేపట్టారు.

అలాగే భద్రాచలం రామాలయం వేద పండితులు కూడా ఆయనకు వేద ఆశీర్వచనాలు అందించి తీర్ధ ప్రసాదాలను అందించారు. ఈకార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కె.ప్రవీణ్ కుమార్,కరికల్ వలవన్, బి.రాజశేఖర్,ఎస్.ఎస్.రావత్,జి.సాయిప్రసాద్,ముఖ్య కార్యదర్శులు యం.టి కృష్ణబాబు,సిఇఓ ముకేశ్ కుమార్ మీనా,ముత్యాల రాజు,యం. రవిచంద్ర, పలువురు కార్యదర్శులు ఇంకా పలువురు ఉన్నతాధికారులు సిఎస్ డా.జవహర్ రెడ్డికి పుప్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇంకా ఈకార్యక్రమంలో సచివాలయ విభాగాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు,సిఎస్ కార్యాలయ అధికారులు,సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇవి కూడా చదవండి..
శాంసంగ్ గెలాక్సీ A14, M54 5G, S23 సిరీస్ లాంచ్‌కు ముందే ఫీచర్స్ లీక్
డిసెంబర్10న డా.జి.సమరంతో దాంపత్య వికాసంపై నేషనల్ లెవల్ ట్రైనింగ్ క్యాంప్
ఇండియాలో మొట్టమొదటి అంతర్జాతీయ బౌద్ధ విశ్వవిద్యాలయం.. ఎక్కడంటే..?
ఫ్రీగా హిందూ పురాణాలకు సంబంధించిన పీడీఎఫ్ బుక్స్..

సమీర్ శర్మ కు సీఎం జగన్ కీలక బాధ్యతలు

వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం..విచారణ తెలంగాణకు బదిలీ
పిల్లల్లో మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?
అమ్మకానికి మినరల్ వాటర్ కంపెనీ బిస్లరీ..కారణం ఇదే..
ఏపీ లోని రైతులందరికి గుడ్ న్యూస్

పాట్నాలో ఎయిర్ టెల్ 5G ప్లస్ సేవలు ప్రారంభం

త్వరలో మార్కెట్ లోకి రానున్న వన్ ప్లస్ 11
నాసల్ కోవిడ్ వ్యాక్సిన్‌ కు ఆమోదం..

ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

చిన్నారుల్లో ఊబకాయానికి ప్రధాన కారణాలు.. ?
శరీరంలో అత్యంత బరువైన అవయవం ఏది..?

CM Jagan entrusted key responsibilities to CS Sameer Sharma