365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్,మే 29,2025: దివంగత ప్రజాయుద్ధ కళాకారుడు గద్దర్ స్మారకార్థం ఏర్పాటు చేసిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2024 విజేతలను గురువారం ప్రకటించారు. జ్యూరీ చైర్‌పర్సన్, ప్రముఖ నటి జయసుధ ఈ అవార్డుల వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది ఉత్తమ మొదటి చిత్రంగా ‘కల్కి’ నిలిచింది. జూన్ 14న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అట్టహాసంగా అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రధాన అవార్డులు – విజేతలు:

  • ఉత్తమ మొదటి చిత్రం: కల్కి
  • ఉత్తమ రెండో చిత్రం: పొట్టేల్
  • ఉత్తమ మూడో చిత్రం: లక్కీ భాస్కర్
  • ఉత్తమ బాలల చిత్రం: 35 ఇది చిన్న కథ కాదు
  • ఉత్తమ ఫీచర్ హెరిటేజ్ అవార్డు: రజాకార్
  • ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప-2)
  • ఉత్తమ దర్శకుడు: నాగ్‌ అశ్విన్ (కల్కి)
  • ఉత్తమ నటి: నివేదా థామస్ (35 ఇది చిన్న కథ కాదు)
  • ఉత్తమ గాయని: శ్రేయా ఘోషల్ (పుష్ప-2)
  • ఉత్తమ స్క్రీన్ ప్లే: వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
  • ఉత్తమ హాస్యనటులు: వెన్నెల కిషోర్, సత్య
  • ఉత్తమ కొరియోగ్రాఫర్: గణేష్‌ ఆచార్య (దేవర)
  • ఉత్తమ కథా రచయిత: శివ పాలడుగు
  • ఉత్తమ పుస్తకం: రెంటాల జయదేవ్ (మన సినిమా పుస్తకం)
    స్పెషల్ జ్యూరీ అవార్డులు:
  • అనన్య నాగళ్ల (పొట్టేల్)
  • దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
  • ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా-2)
    ఈ సందర్భంగా జ్యూరీ చైర్‌పర్సన్ జయసుధ మాట్లాడుతూ, గద్దర్ స్ఫూర్తితో తెలుగు సినిమాకు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులను ఇస్తున్నామని తెలిపారు. కాగా, 2014-23 సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను కూడా త్వరలో ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు. జూన్ 14న జరిగే ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.