365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 17, 2025: క్రికెట్ ప్రియులకు జియో భారీ శుభవార్త అందించింది. ఐపీఎల్ సీజన్‌ను ఉచితంగా వీక్షించేందుకు వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ క్రేజీ ఆఫర్‌లో భాగంగా, జియో కస్టమర్లు 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్ లో 4K క్వాలిటీలో మ్యాచ్‌లను ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా చూసే అవకాశాన్ని పొందనున్నారు.

ఎలా లభిస్తుంది ఈ ఆఫర్?

జియో వినియోగదారులు రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ విలువైన (1.5GB/రోజు లేదా ఎక్కువ) ప్లాన్‌తో 17 మార్చి – 31 మార్చి 2025 మధ్య రీచార్జ్ చేయాలి. కొత్త కస్టమర్లు కూడా 299 రూపాయల ప్లాన్‌తో కొత్త జియో సిమ్ తీసుకుని ఈ బెనిఫిట్‌ను పొందవచ్చు.

Read this also…Jio Unveils Unlimited Cricket Offer for Fans in Telangana & Andhra Pradesh

Read this also…Mumbai Indians Women Clinch Second WPL Title, Cementing Their Legacy

ఇది కూడా చదవండిభారత మార్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ F16 5G లాంచ్

ఇప్పటికే 17 మార్చి 2025 నాటికి రీచార్జ్ చేసిన వినియోగదారులు రూ. 100 అదనపు ప్యాక్ ద్వారా ఈ ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. జియో హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ 22 మార్చి 2025 నుంచి 90 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.

ఇంకా ఏమున్నాయా ప్రత్యేకతలు?

  • జియో ఫైబర్/జియో ఎయిర్‌ఫైబర్ ద్వారా 50 రోజుల పాటు ఉచిత ట్రయల్
  • 800+ టీవీ ఛానల్స్, 11+ ఓటీటీ యాప్స్, అన్‌లిమిటెడ్ వైఫై
  • అత్యుత్తమ 4K స్ట్రీమింగ్ అనుభవం

Read this also…Samsung Unveils Galaxy F16 5G in India with Best-in-Class Features

ఇది కూడా చదవండి5 లక్షల డౌన్ పేమెంట్ తో చౌకైన టయోటా ఫార్చ్యూనర్ మోడల్..

ఇది కూడా చదవండి…ఫిబ్రవరి 2025లో ఏ కంపెనీ ఎన్ని వాహనాలను విక్రయించింది..?

ఈ సూపర్ ఆఫర్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి 60008-60008 కు మిస్డ్ కాల్ ఇవ్వొచ్చు లేదా జియో స్టోర్/జియో వెబ్‌సైట్ సందర్శించవచ్చు.