365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్, విశాఖపట్నం, జనవరి 31, 2025: రిలయన్స్ జియో జనవరి నెలను రహదారి భద్రతా నెలగా గుర్తించి విస్తృత అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. ఈ క్రమంలో, ట్రాఫిక్ పోలీసు విభాగం సహకారంతో సిరిపురం జియో సెంటర్ నుంచి బైక్ ర్యాలీ,అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ ర్యాలీ రహదారి భద్రతా ప్రతిజ్ఞతో ప్రారంభమైంది, ఇందులో బాధ్యతాయుతమైన డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాల అనుసరణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ర్యాలీలో పాల్గొన్నవారు RTC కాంప్లెక్స్ (అసిలమెట్ట) జంక్షన్, రామ టాకీస్ రోడ్డు, మస్జిద్ జంక్షన్, VIP రోడ్డు, దత్ ఐలాండ్ జంక్షన్, సిరిపురం జంక్షన్ వంటి ముఖ్య ప్రాంతాల ద్వారా ప్రయాణించి, సిరిపురం జియో సెంటర్ వద్ద ర్యాలీని ముగించారు.

ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో రహదారి భద్రతపై మరింత అవగాహన కల్పించేందుకు తోడ్పడుతుంది. ‘సడక్ సురక్ష – జీవన్ రక్ష’ అనే థీమ్‌తో జనవరి 1 నుంచి 31 వరకు నెల పొడవునా నడిచే ఈ ప్రచారం, యువతలో చైతన్యం పెంచడం, రహదారి భద్రతపై అవగాహన కల్పించడం, ప్రవర్తనా మార్పులను ప్రోత్సహించడం, ప్రమాదాలను, మరణాలను తగ్గించడం లక్ష్యంగా ఉంది.
జియో ప్రతి ఒక్కరిని జాతీయ రహదారి భద్రతా ప్రచారంలో భాగస్వామ్యులు కావాలని, రహదారులను మరింత భద్రంగా మార్చడంలో తమ పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేస్తోంది.