Sun. Sep 15th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 4,2024: అసాధారణ మైన వర్షాలు, వరదలతో అంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తల్లడిల్లు తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. టెలికాం నెట్వర్క్ దెబ్బతింది. పౌరులు, రక్షణ సిబ్బంది, అవసరమైన సమాచార మార్పిడికి సమన్వయానికి మార్గం లేకుండా నిలిచిపోయారు.

తన వంతు బాధ్యతగా జియో తక్షణమే ముందడుగు వేసింది. వరదల వల్ల దెబ్బతిన్న టెలికాం నెట్వర్క్ ను యుద్ద ప్రాతిపదికన పునరుద్ధరించింది.

జియో నెట్వర్క్, మెయింటెనెన్స్ సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఇబ్బందులను సైతం ఎదుర్కొని పూర్తి తోడ్పాటును అందించారు.

ఫలితంగా అతి తక్కువ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో జియో తన నెట్వర్క్ కవరేజ్ ను తిరిగి ఇవ్వగలిగింది. వరద పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాని చోట్ల కూడా నెట్వర్క్ ను పునరుద్ధరించేందుకు సంసిద్దంగా ఉంది.

error: Content is protected !!