Wed. Dec 4th, 2024
Jio-5g

రోజుకు రూ. 19 కే అపరిమిత 4జీ అండ్ 5జీ డేటా

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, 31 మార్చి 2023: ఉచిత ఇన్‌కమింగ్ అండ్ అవుట్‌గోయింగ్ కాల్స్ తో భారతీయ టెలికాం మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన జియో సంస్థ ఇప్పుడు మరో సంచలనానికి తెరతీసింది.

టెలికాం పరిశ్రమలో మొదటి సారిగా అపరిమితమైన డేటా ఆఫర్‌తో ముందుకు వచ్చింది. రూ. 599 నెలవారీ ప్లాన్ ద్వారా కస్టమర్లు అపరిమితమైన వాయిస్ కాలింగ్, అపరిమితమైన 4G డేటా అండ్ రోజుకు 100 SMSలను పొందే అవకాశం ఉంటుంది.

అలాగే వినియోగదారులు, JioTV, JioCinema అండ్ JioCloudతో సహా మరిన్ని Jio యాప్‌ సేవలను ఉచితంగా పొందవచ్చు. జియో వెల్‌కమ్ ఆఫర్ కింద అర్హత కలిగిన వినియోగదారులకు అపరిమితమైన Jio True 5G డేటా కూడా లభిస్తుంది.

ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్‌కు మారాలనుకొనే వారికి అండ్ ప్రీమియం సేవలు కావాలనుకునే కొత్త కస్టమర్‌లకు జియో ఈ ప్లాన్ 30రోజుల ఉచిత ట్రయల్‌ని కూడా అందిస్తోంది. సరికొత్త 599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ పట్ల వినియోగదార్లు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే..? రోజుకు కేవలం రూ. 19 అతి తక్కువ ఖర్చుతో వినియోగదారులు ఒకే ప్లాన్‌తో బహుళ ప్రయోజనాలను పొందడమే ఇందుకు ప్రధాన కారణం.

error: Content is protected !!