వన్ జీబీఎఎస్+వేగంతో అన్ లిమిటెడ్ 5జీ డేటా వినియోగానికి ‘జియో వెల్కం ఆఫర్’
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సూర్యాపేట, 20 ఏప్రిల్ 2023: రిలయన్స్ జియో తన ట్రూ 5జీ సేవలను సూర్యాపేటలో లాంఛనంగా ప్రారంభించింది. బుధవారం నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ఈ సేవలను ప్రారంభించారు.

ఈ సేవల ప్రారంభంతో సూర్యాపేటలోని జియో వినియోగదారులకు జియో వెల్కం ఆఫర్ ఆహ్వానం అందుతుంది. దీనిద్వారా వారు అదనపు ఖర్చు లేకుండా వన్ జిబిపిఎస్ + వేగంతో అపరిమిత 5జీ డేటాను పొందవచ్చు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో జియో వినియోగదారులు 5జీ సేవలను పొందుతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ లోని ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి.

జియో ట్రూ 5జి సేవల ప్రారంభంతో తెలంగాణ ఉత్తమ టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్ ను పొందడమే కాకుండా, ఇ-గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఐటి, ఎస్ఎమ్ఇ వ్యాపార రంగాలలో వృద్ధి అవకాశాలకు తలుపులు తెరుస్తుంది.
జియో ట్రూ 5జి పౌరులు, ప్రభుత్వం రియల్ టైమ్ ప్రాతిపదికన కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది. చిట్టచివరి అడుగు వరకు ప్రభుత్వ పథకాల అమలు సామర్థ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్, జియో సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.